
అమ్మో.. నిమ్మకాయ.. కొంపముంచిందా..!?
- Writer Desk

- 1 day ago
- 1 min read
ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ లో అభిమాని నిమ్మకాయ పూజ..!
ఇలా మంత్రించగానే.. అలా పడిపోయిన ప్రత్యర్థుల జట్టు వికెట్..!
ఈ నిమ్మకాయ మంత్రాంగం వల్లే మా వాళ్ళు ఢీలా పడ్డారన్నట్లుగా చెన్నై సూపర్ కింగ్స్ ఆందోళన..!
క్రికెట్ కంట్రోల్ బోర్డు లో ఫిర్యాదు..!
మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కానీ.. వికెట్లు మాత్రం పడిపోతున్నాయి..!
ఉప్పల్ స్టేడియంలో తమ జట్టు గెలవాలని ఓ అభిమాని చేసిన నిమ్మకాయ మంత్రం.. అనుకోకుండా ప్రత్యర్థి జట్టుపై ప్రభావం చూపింది.. ఇలా నిమ్మకాయ కళ్ళ దగ్గర పెట్టుకుని మొక్కుతున్నట్లుగా మాత్రించగానే... అలా ప్రత్యర్థి జట్టుకు చెందిన బ్యాట్స్ మెన్ ఔట్ అయ్యాడు..!
ఐపీఎల్ భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది..! అయితే గ్యాలరీలో ఒక వ్యక్తి నిమ్మకాయలతో చేసిన ఒక చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!

మ్యాచ్ లో తాను అభిమానించే సన్ రైజర్స్ జట్టు విజయాన్ని కోరుకుంటూ సదరు అభిమాని నిమ్మకాయతో మంత్రాలు చదువుతున్నట్లు వీడియోలో కనిపించాడు. అతను అలా చేయగానే గ్రౌండ్‌లో సీ ఎస్ కే తరపున బ్యాటింగ్ చేస్తున్న దూబే ఔట్ అయ్యాడు.. దీంతో సదరు అభిమాని కేరింతలు కొడుతూ తన మంత్రం ఫలించింది అన్నట్లుగా సంతోషం వ్యక్తం చేశాడు..! ఇదంతా అతని పక్కన కూర్చున్న వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు..
మొత్తంగా ఈ వీడియో చెన్నై సూపర్ కింగ్స్ నిర్వాహకుల దృష్టికి వెళ్ళింది..! దీంతో తమ ఆటగాళ్లపై ప్రభావం చూపేలా గ్రౌండ్ లో నిమ్మకాయలతో తాంత్రిక పూజలు చేశారని.. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చెన్నై సూపర్ కింగ్స్ నిర్వాహకులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు..!

ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం..! అంత మాత్రాన ఎవరో నిమ్మకాయ పూజ చేస్తేనే తమ జట్టు ఓడిపోయింది అన్నట్లుగా ఇలా ఫిర్యాదు చేయడం వింతగా ఉందని సన్ రైజర్స్ అభిమానులు సి ఎస్ కే నిర్వాహకుల తీరుపై సెటైర్లు వేస్తున్నారు..!
మొత్తంగా నిమ్మకాయ మంత్రం... గట్టిగానే వివాదం సృష్టించింది..!
.......
A Report By
SuneelVeer
9493439309


Comments