
ఙ్ఞానం ఇచ్చే అమ్మ..!
- Writer Desk

- Jan 23
- 2 min read
వసంత పంచమి ..!
ఈ రోజున సరస్వతి దేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలే..! మాఘశుద్ధ పంచమినే 'వసంత పంచమి' అంటారు. మాఘ నెలలో శుక్లా పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు.
ఈ సంవత్సరంలో జనవరి 23న ఈ వసంతి పంచమి వచ్చింది. ఆరోజున సరస్వతి దేవి ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం వస్తుంది.
విశిష్టత...
విద్యా స్వరూపిణి సరస్వతీ దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు. శ్రీపంచమిని విద్యారంభదినమని, వాగ్దేవిని ఆరాధించి, అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది.

విద్యాదానం జ్ఞానదానమేనని అన్న దానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు. శాంతమూర్తియైన సరస్వతీ దేవి ఒకచేత వీణ, మరోచేత పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ రూపం విద్య, జ్ఞాన, బుద్దులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు.

సరస్వతి దేవి పూజా విధానం...
వసంత పంచమి రోజున సరస్వతి దేవిని తెల్లని పుష్పాలతో పూజించి… అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి.
తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం.. నేతితో పిండివంటలు, చెరకు, అరటిపండ్లు, నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి.
ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది. కుల, మత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతి దేవిని పూజిస్తున్నా మాఘ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

అక్షరాభ్యాసం..!
“యాకుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితాయా
వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసనాయా
బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిదేవై సదా పూజితా
సామాంపాతు సరస్వతీ, భగవతీనిశ్శేష జడ్యా పహః..
ఈ శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమవుతుంది..
ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ దేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.
సరస్వతీ దేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు.

సంక్షిప్తంగా..
మాఘశుద్ధ పంచమి రోజున జరుపుకునే వసంత పంచమి (శ్రీ పంచమి) జ్ఞానానికి అధిదేవత సరస్వతీ దేవి జయంతిగా అత్యంత పవిత్రమైనది. ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. విద్యార్థులు పుస్తకాలు, కళాకారులు వాయిద్యాలను పూజించి, పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. పసుపు రంగుకు ప్రాధాన్యత ఇస్తూ, పసుపు వస్త్రాలు ధరించి సరస్వతీ దేవిని ఆరాధించడం విశేషం.
సరస్వతీ పూజ : బ్రహ్మదేవుడు సరస్వతీ దేవిని సృష్టించిన రోజు (సరస్వతీ జయంతి)గా దీనిని భావిస్తారు. విద్య, బుద్ధి, కళలకు అధిదేవత అయిన అమ్మవారిని ఈ రోజు పూజించడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. పూజావిధానంలో తెల్లని పువ్వులు పాలు ప్రసాదం అమ్మవారికి తెలుపు వర్ణం ఇష్టం కాబట్టి అదే రంగులో నివేదన ఉంటే విశిష్టమని ప్రతీతి!
అక్షరాభ్యాసం: కొత్తగా చదువు ప్రారంభించే చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం (అక్షర శ్రీకారం) చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు. ముఖ్యంగా బాసర వంటి సరస్వతీ క్షేత్రాలలో భక్తులు అధికంగా పాల్గొంటారు.
పసుపు రంగు ప్రాధాన్యత: ప్రకృతిలో పసుపు రంగు ఆవాల పంటలు వికసించే సమయం కావడంతో, సరస్వతీ దేవికి పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు పూలు సమర్పిస్తారు. చక్కెర పొంగలి, పులిహోర నైవేద్యంగా పెడతారు.!
వసంత ఋతువు ఆరంభం: శీతాకాలం ముగిసి, ప్రకృతి కొత్త చిగుర్లతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో వసంతానికి స్వాగతం పలుకుతుంది.
కామదేవ పూజ: కొన్ని సంప్రదాయాలలో ఈ రోజును 'మదన పంచమి'గా జరుపుకుంటూ కామదేవుడు మరియు రతీదేవిని పూజిస్తారు.
తెలంగాణలోని ముఖ్య సరస్వతి ఆలయాలు:
బాసర జ్ఞాన సరస్వతి ఆలయం (నిర్మల్ జిల్లా): గోదావరి నది ఒడ్డున ఉంది. భారతదేశంలోని రెండు ప్రసిద్ధ సరస్వతి ఆలయాలలో ఇది ఒకటి.
వర్గల్ విద్యా సరస్వతి ఆలయం (సిద్దిపేట జిల్లా): ఇక్కడ సరస్వతి దేవి కొండపైన వెలసింది, కంచి శంకర మఠం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది.
అనంతసాగర్ సరస్వతి ఆలయం (సిద్దిపేట జిల్లా): ఇది కూడా ప్రసిద్ధ విద్యా సరస్వతి క్షేత్రం.
మంథని శ్రీ విద్యా సరస్వతి ఆలయం (పెద్దపల్లి జిల్లా): గౌతమేశ్వర ఆలయ పరిధిలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం.
అడ్లూరు సరస్వతి ఆలయం (సూర్యాపేట జిల్లా): చింతలపాలెం మండలంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో:
విజయవాడ ఇంద్రకీలాద్రి: వసంత పంచమి వంటి ప్రత్యేక సందర్భాలలో దుర్గమ్మను సరస్వతి దేవి అవతారంలో అలంకరిస్తారు.
.........






Comments