
భారీ గణనాధుడి వాహనం వచ్చేసింది..!

హైదరాబాద్:
బడా గణేష్ తరలింపుకు వాహనం సిద్ధం..!
ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుడు నిమజ్జనోత్సవానికి సిద్ధమవుతున్నాడు.!

శనివారం ఉదయం ట్యాంక్ బండ్ కు శోభాయాత్రగా తరలివెళ్ళనున్నాడు...
భారీ గణనాయకుడి తరలింపుకు భారీ వాహనం కావాలి కదా...!

అదే వాహనం ఇపుడు విజయవాడ నుండి తరలి వచ్చింది...
విజయవాడ నుండి సూర్యాపేట వరకు వచ్చిన వాహనాన్ని.. మన హైదరాబాద్ పోలీసులు వెళ్లి ఖైరతాబాద్ కు తీసుకువచ్చారు..
మహాగణపతి తరలింపు కోసం టస్కర్ వాహనాన్ని వినియోగిస్తారు..

ఎనిమిది వేల కిలోల నుండి ఇరవై ఐదు వేల కిలోల బరువున్న వాటిని టస్కర్ వాహనం అవలీలగా తీసుకువెళ్లగలుగుతుంది...
బరువును బట్టి వాహనం స్థాయి నిర్ణయిస్తారు...!
నిజానికి ఖైరతాబాద్ గణేశుడి విషయంలో కచ్చితమైన బరువు అంచనా ఏమీ ఉండదు..!

ప్రతీ ఏటా ఏర్పాటు చేయబోయే విగ్రహం రూపురేఖలు.. ఎత్తు మారుతుంటాయి..
విగ్రహం రేఖా చిత్రాన్ని బట్టి.. ఎప్పటికప్పుడు కావలసిన నిర్మాణ సామాగ్రి ని సమకూర్చుకుని రూపకల్పన చేపడతారు..




Comments