top of page

సార్..నన్ను వాట్సాప్ గ్రూప్ నుండి తీసేసారు..! యాడ్ చేయించండి..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 1 day ago
  • 2 min read

వాట్సాప్ కొత్త పుంతలు తొక్కుతోంది..!

దేశీయంగా అత్యధికంగా వినియోగిస్తున్న సోషల్ నెట్ వర్కింగ్ వాట్సాప్ అనేది అందరికీ తెలిసిందే..! దిన చర్యలో వృత్తి విద్య వైద్య వ్యాపారాల్లో వాట్సాప్ వినియోగం భాగమై పోయింది..!


అసలు వాట్సాప్ లేనిదే ఇపుడు ఏ పని చేయలేని పరిస్థితి..! ప్రభుత్వ ప్రైవేట్ సేవలు కూడా వాట్సాప్ లోకి వచ్చేశాయి... ప్రపంచమంతా వాట్సాప్ వినియోగాన్ని ఒక జీవన మనుగడలో భాగంగా మార్చేసుకున్నారు..!


ఎన్ని కొత్త నెట్ వర్క్ యాప్స్ మార్కెట్ లోకి వచ్చినా వాట్సాప్ ముందు నిలబడలేకపోతున్నాయి..!


వాట్సాప్ విస్తరణ గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది..!


అయితే ఇపుడు కాలనీ.. డివిజన్.. బస్తీ నివాసితులు ఏర్పాటు చేసుకునే వాట్సాప్ గ్రూప్ లు వివాదాలకు దారితీస్తున్నాయి..!


రెండు మూడేళ్లుగా వాట్సాప్ లో మెసేజ్ పోస్టింగులపై గొడవలు పడిన ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి..! ఇపుడు అలాంటి ఫిర్యాదులు గొడవలు సర్వసాధారణం అయిపోయాయి..!


అయితే కొత్తగా ఓ మహిళ వింత ఫిర్యాదుతో పోలీసు స్టేషన్ ను ఆశ్రయించింది..!


తనను వాట్సాప్ గ్రూప్ నుండి తొలగించారని.. ఆ గ్రూప్ లలో తన ఫోన్ నెంబర్ ను తిరిగి చేర్పించాలని పోలీసులను కోరింది.. అయితే ఇలాంటి ఫిర్యాదు కొత్తగా రావడంతో అవాక్కయిన పోలీసులు.. ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి సదరు మహిళ ఫోన్ నెంబర్ ను గ్రూప్ లో చేర్చాలని ఆదేశించారు..!


వాట్సాప్ గ్రూప్ లో పోస్టింగులు మెసేజులపై ఫిర్యాదులు వచ్చాయి కానీ... ఇలా తన నెంబర్ ను గ్రూప్ లో చేర్పించాలంటూ ఎవరూ పోలీస్ స్టేషన్ కు రాలేదని.. ముందు ముందు గ్రూప్ లలో యాడ్ చేయడం రిమూవ్ చేయడంపై కూడా గొడవలు ఎక్కువవుతాయి కావొచ్చంటూ పోలీసులు సరదాగా ఛలోక్తులు విసిరారు..!



••••••••

ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన క్రింది వార్త ఆధారంగా...


తనను వాట్సాప్ గ్రూపు నుంచి తొలగించారని, తిరిగి గ్రూపులో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఓ మహిళ పోలీ సులను ఆశ్రయించింది..!


బంజారాహిల్స్ రోడ్డు నెంబర్. 12 ఎన్బీటీ నగర్ బస్తీకి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది.


ఈ గ్రూపులో బస్తీ సమస్యల గురించి పోస్టు చేయాల్సి ఉంటుంది.


ఇటీవల వాట్సాప్ గ్రూపులో రాజకీయ పోస్టింగ్ లు పెడుతున్నారు..!


ఇది గ్రూపులోని మిగతా సభ్యులకు ఇబ్బందిగా మారడంతో అడ్మిన్ ఎటువంటి రాజకీయ పోస్టింగ్లు చేయవద్దని గ్రూపులోని సభ్యులను హెచ్చరించాడు..!


అయినప్పటికీ ఓ మహిళ రాజకీయ పోస్టు పెట్టింది. దాంతో అడ్మిన్ ఆ మహిళను గ్రూపు నుంచి తొలగించాడు..!


సదరు మహిళ తన పేరును గ్రూప్లో చేర్చాలని పలు మార్లు విజ్ఞప్తి చేసినా అడ్మిన్ పట్టించుకోలేదు..!


దీంతో మహిళ తనను తిరిగి వాట్సాప్ గ్రూప్లో చేర్చకుండా అడ్మిన్ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది..!


స్టేషన్ కు వచ్చిన అడ్మిన్.. ఆ మహిళ పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూప్ లో చేర్చేది లేదని స్పష్టం చేశాడు..!


...................


A Report By

SHyamaSundar Akula

9010746999


•••••••••••••


Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page