
మమ్మల్ని అధికారులు టార్చర్ చేస్తున్నారు..!
- Writer Desk

- 6 days ago
- 4 min read
కాల్ మనీ మాఫియాను మించిన స్థాయిలో వేధింపులు..!
అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్లు..!
రూపాయికి పది రూపాయల వడ్డీ.. చక్రవడ్డీ బారు వడ్డీకి మించిన బడాచోర్ వడ్డీ..!
మహిళలకు ఇచ్చిన రుణాలు చెల్లించిన రుణాల వివరాలన్నీ దొంగ లెక్కలు..!
చెల్లించిన వాళ్ళవి చెల్లించనట్లుగా..ఎగవేసిన వాళ్ళవి చెల్లించినట్లుగా లెక్కలు.. అంతా గోల్ మాల్ వ్యవహారం..!
ప్రభుత్వ అనుబంధంగా కొనసాగుతూ మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రుణాలు ఇచ్చే స్త్రీనిధి సంస్థ వ్యవహారం ఇది..!
••••••••
కరోనా సంక్షోభ పరిస్థితుల్లో గ్రామాల్లో సెల్ఫ్ హెల్ప్ మహిళా గ్రూపులకు సంబంధించి కొన్ని నెలల పాటు రుణాలు కట్టకుండా పెసులుబాటు కల్పించేలా పై నుండి ఒత్తిడి చేయించిన ప్రజా ప్రతినిధులు తర్వాత తమకేం సంబంధం.లేనట్లుగా తప్పించుకున్నారు..! ఆ అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ రుణాలు తీసుకున్నవాళ్లు మొత్తంగానే డబ్బులు కట్టకుండా మొండికేశారు..!
తమకు చెడ్డపేరు రాకుండా చూసుకునేందుకు.. అధికారుల వద్ద మంచి మార్కులు కొట్టాలనే యావతో అడ్డగోలు అక్రమాలకు పాల్పడ్డ ద్వితీయ శ్రేణి అధికారులు రాష్టం మొత్తంలో పూర్తిగా నిబంధనలు కలరాస్తూ ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేశారు. ఒక జిల్లాలో ఎక్కువ రుణాలు చెల్లించినట్లుగా కనిపిస్తే ఆ నిధులను తక్కువ చెల్లింపులు ఉన్న జిల్లాలకు సర్దడం... ఎవరు ఎంత చెల్లించారో ఎంత బకాయి ఉందో తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా సెల్ఫ్ హెల్ గ్రూప్ సభ్యుల ఖాతాలలో మార్పులు చేయడం చేశారు.. దీంతో ఒక్క రుణ వాయిదా చెల్లించని సభ్యులు కూడా తొంభై శాతం రుణం చెల్లించినట్లుగా.. క్రమం తప్పకుండా కట్టిన సభ్యులు నెలసరి వాయిదాలు ఎగవేసినట్లుగా ఆన్లైన్ జాబితాలో లెక్కలు చూపిస్తున్నాయి..!
రెండు లక్షల రూపాయలు ఉన్న నిరర్ధక రుణాలను ఐదేళ్లలో రూ. 42 లక్షలు..మరో ఏడాది కాలంలో ఇరవై లక్షలు పెంచి మొత్తం అరవై రెండు లక్షలు చూపించారు..!
ప్రజాప్రతినిధుల జోక్యంతో కరోనా పెసులుబాటు రావడంతో.. అప్పటి వరకు క్రమం తప్పకుండా రుణాలు కట్టిన సభ్యులు కూడా ఆ తర్వాత కట్టడం మానేశారు..!
క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని గుర్తించకుండా. ద్వితీయ శ్రేణి.. ఆ క్రింది స్థాయి అధికారులు చేసిన దుర్మార్గపు చర్యలవల్ల నరకం అనుభవిస్తున్న విలేజ్ ఆర్గనైజర్ల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న స్త్రీనిధి ఉన్నతాధికారులు.. ఇపుడు పేరుకుపోయిన బకాయిలు మొత్తానికి విలేజ్ ఆర్గనైజర్లను బాధ్యులను చేస్తూ.. సభ్యుల చేత బకాయిలు కట్టించలేకపోతే క్రిమినల్ కేసులు పెట్టించి జైల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు..! డబ్బులన్నీ స్త్రీనిధి ఖాతాకు జమచేయకుండా బొక్కెసారంటూ నిందలు వేస్తున్నారు.. ఉన్న ఊరిలో విలేజ్ ఆర్గనైజర్లుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లను పర్యవేక్షించే ప్రతినిధులను స్త్రీనిధి అధికారులు దారుణంగా బెదిరిస్తున్నారు...

మీ ఊర్లోనే మిమ్మల్ని దోషులుగా అవినీతి అక్రమార్కులుగా చూపిస్తామని తీవ్ర మైన బెదిరింపులకు పాల్పడుతున్నారు.. దీంతో ఈ మధ్య కాలంలో ఎంతో మంది ఆర్గనైజర్లు ఆత్మహత్యలకు పాల్పడగా.. కొంతమంది ఆర్గనైజర్లు మానసిక ఒత్తిడితో హాస్పిటల్లలో చేరుతున్నారు...
ఉదాహరణకు యాదాద్రి భువనగిరి జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ పెద్ద మండలాలలో వలిగొండ మండలం ఒకటి.. మొత్తం ముప్పై ఏడు గ్రామాలు ఈ మండలం పరిధిలో ఉన్నాయి.. యాబై కి పైగా స్వయం సహాయక బృందాలు ఇక్కడ నడుస్తున్నాయి..!
2020 కరోనా సమయం వరకు వలిగొండ మండల కేంద్రంలో ఆరు సంఘాలు( వాడుకలో సంఘ బంధాలు అని పిలుస్తారు) ఉండగా కరోనా ముందు వరకు..అంటే 2020 వరకు ఒక్క రూపాయి కూడా బకాయి లేదు..2021 లో రెండవసారి లాక్ డౌన్ వరకు రెండు లక్షలు నిరర్ధక బకాయిల కింద చూపించారు.. నిజానికి నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రోద్బలంతో స్థానికంగా గ్రామ సర్పంచ్ లు జోక్యం చేసుకుని.. తమ పరిధిలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల రుణ వాయిదాల చెల్లింపులకు రెండు మూడు నెలల పాటు వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేయడంతో.. శ్రీనిధి అధికారులు అంగీకరించారు.. నిజానికి విలేజ్ ఆర్గనైజర్ల ప్రమేయం లేకుండానే అధికారులు ఈ అవకాశం కల్పించారు.. దీన్ని ఆసరా చేసుకుని మొత్తంగా సభ్యులు రుణవాయిదాలు చెల్లించడం మానేశారు.. విలేజ్ ఆర్గనైజర్లు సభ్యుల పై ఒత్తిడి చేసి రుణ వాయిదాల చెల్లించేలా తమ ప్రయత్నం.తాము చేసారు..

ఈ లోగా పైస్థాయిలో స్త్రీనిది అధికారుల వ్యవహారం ఇష్టారాజ్యంగా మారిపోయింది.. అసెంబ్లీ ఎన్నికలు ప్రభుత్వాలు మారిపోవడం..మంత్రిగా సీతక్క బాధ్యతలు చేపట్టడంతో.. ఎంత గోల్ మాల్ చేయాలో అంత చేసారు..సెల్ఫ్ హెల్ప్ గ్రూపులపై నేరుగా పెత్తనం చేయడం.. సెర్ప్ అధికారులను ప్రలోభపెట్టి క్రిందిస్తాయిలో విలేజ్ ఆర్గనైజర్లు.. వారి పైస్థాయి ఇంచార్జీలను ఒత్తిడికి గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.. కరోనా తర్వాత రుణ వసూళ్లు సరిగా లేని ప్రాంతాల్లో మేనేజర్ల స్థాయి అధికారుల వద్ద పెద్దమొత్తంలో వసూళ్లు చేసి.. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల ఖాతాలను మార్చడం వంటి చర్యలకు పాల్పడ్డారు.. స్త్రీనిధి కి సంబంధించి ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ తీసుకువచ్చి అందులోనూ అక్రమాలకు పాల్పడ్డారు.. ప్రతీ చెల్లింపుకు పది రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు.. అస్సలు రూపాయి కూడా రుణం.చెల్లించని వల్ల ఖాతాల్లో చాలా వరకు డబ్బులు చెల్లించినట్లుగా ఆన్ లైన్ లో చూపించడంతో.. కట్టాల్సిన వాళ్ళు కూడా కట్టకుండా మొండికేశారు...
ఎవరో ఒక ఆర్గనైజర్ అక్రమాలకు పాల్పడితే మొత్తం ఆర్గనైజర్లు అందరూ అక్రమార్కులు అన్నట్లుగా ముద్రవేసి వాళ్లను దోషులుగా నిలబెట్టే ప్రయత్నంచేస్తున్నారు..
నాలుగు వందల కోట్ల టర్నోవర్ దాటితే ప్రభుత్వ ఆధీనంలోని కో - ఆపరేటివ్ సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులను.నియమించాల్సి ఉంటుంది.. ఇది అధికారిక నిబంధన..!
కానీ ఇక్కడ అవినీతిపరుడుగా ముద్రపడిన విద్యాసాగర్ రెడ్డిని స్త్రీనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగిస్తున్నారు..!
మంత్రి సీతక్కను కూడా పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు.. స్త్రీనిధి సెర్ప్ లో పైస్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై మంత్రి దృష్టి పడకుండా... క్రిందిస్తాయిలో స్వయం సహాయక బృందాలు.. ఆర్గనైజర్లు ఇంచార్జీ లను అక్రమార్కులుగా చిత్రీకరిస్తూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు..!
రెండు లక్షలు నాలుగేళ్లలో నలభై రెండు లక్షలు..! మరో ఏడాదిలో అరవై రెండు లక్షలు..!
చక్రవడ్డీ బారువడ్డీని మించిన బడాచోర్ వడ్డీ..!
2021 వరకు రెండు లక్షలుగా ఉన్న బకాయిలు 2025 వరకు నలభై రెండు లక్షలు చూపించి ఏడాదిలోనే అది ఇరవై లక్షలు పెరిగి రూ.62 లక్షలకు చేరుకున్నట్లుగా చూపిస్తున్నారు..!
ఉదాహరణకు ఒక సభ్యురాలు ముప్పై వేలు రుణం.తీసుకుంటే నెలసరి వాయిదా వడ్డీతో కలిపి1800 చెల్లించాల్సి ఉంటుంది అనుకుంటే.. అవి చెల్లించని పక్షంలో ముప్పై వేలకు ఈ 1800 కలిపి.. మొత్తంగా చెల్లించాల్సిన రుణం 31800 చేస్తారు.. ఈ మొత్తంపై మరుసటి నెలకు వడ్డీలు వేస్తారు.. ఈ లెక్కన మూడు నెలలు వాయిదాలు చెల్లించని పక్షంలో ముప్పై వేలు ఉన్న రుణ మొత్తం 34800 అవుతుంది.. ఇలా ఎన్ని నెలలు కట్టకపోతే అన్ని నెలలు 1800 చొప్పున కలుపుతూ ఆ మొత్తం మీద వడ్డీ లెక్క కడతారన్నమాట..!
ప్రపంచంలో ఏ బ్యాంకు వడ్డీ వ్యాపారులు కూడా ఈ స్థాయిలో వడ్డీలు బకాయిల లెక్క కట్టడం మనం చూడలేం..! ఇంత దారుణంగా కాకి లెక్కలు చూపించి కాల్ మనీ మాఫియాను మించినట్లుగా విలేజ్ ఆర్గనైజర్లను వేధింపులకు గురిచేస్తూ వారికి నరకయతనను చూపిస్తున్న స్త్రీనిధి యాజమాన్యం వాళ్ళ ప్రాణాలు తోడేస్తోంది...

కరోనా తర్వాత క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది.. వాస్తవిక చెల్లింపుల వివరాలు.. ఆర్గనైజర్ల పనితీరుపై ఒక్కసారి కూడా పరిశీలన చేయకుండా.. గ్రూపుల వారిగా వాస్తవిక పరిశీలన చేయకుండా.. ఇష్టా రాజ్యంగా తప్పుడు లెక్కలు సృష్టించి ఆన్లైన్ లో అడ్డగోలు మార్పులు చేసిన అధికారులు ఇపుడు తమను బలి చేయాలని చూస్తున్నారని.. తప్పులు వాళ్ళు చేసి అక్రమాలకు వాళ్ళు పాల్పడి వాటిని తమపై నెట్టివేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని.. పోలీసు కేసులు పెట్టీ క్రిమినల్స్ ముద్ర వేసి జైళ్లలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విలేజ్ ఆర్గనైజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
అధికారుల అవినీతి అక్రమాలపై ఒక నిజనిర్ధన కమిటీ వేసి విచారణ చేయాలని.. క్షేత్ర స్థాయిలో వాస్తవిక పరిస్థితులు.. కరోనా తర్వాత నుండి రుణాల ఖాతాలలో ఎలాంటి గోల్ మాల్ జరిగింది.. ఎలాంటి తప్పుడు లెక్కలు చూపించారు.. ఎగవేత దారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. ఆర్గనైజర్ల వ్యవహారం..మొత్తంపై నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటపడతాయని ఆర్గనైజర్లు అంటున్నారు.. వెంటనే ప్రభుత్వం ఒక నిజ నిర్ధారణ విచారణ కమిటీని వేయాలని విలేజ్ ఆర్గనైజర్లు డిమాండ్ చేస్తున్నారు..!
ఎలాంటి విచారణ చేయకుండా మమ్మల్ని బలి చేయాలని చూస్తే ఊరుకునే ప్రశ్నే లేదని.. న్యాయపోరాటం చేస్తామని.. అవినీతి అక్రమాల నిగ్గు తెలుస్తామని హెచ్చరిస్తున్నారు..!
నోట్ : ఈ వార్తకు సంబంధించి బాధిత విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్లు ఇచ్చిన స్టేట్మెంట్ సహా అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది..! సభ్యుల రుణాలు చెల్లింపులు బకాయిలు ఇతరత్రా అన్ని ఆధారాలు సేకరించడమైనది
••••••••
A Report By
ShyamaSundar Akula
9010746999




Comments