top of page

ప్రేమంటే ఇదేరా..!!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 2 days ago
  • 2 min read

ప్రేమ ఒక అనిర్వచనీయమైనది.. అంతులేనిది.. హద్దు లేనిది..! ప్రేమించినవారి కోసం ఎంతైనా చేయగలిగినంత ఇష్టమే ప్రేమ..! అది అనుకున్నంత సులువు కాదు..! అన్నీ బావున్నప్పుడు ప్రేమను ప్రదర్శించడం వేరు.. ఏదీ బాలేదు అని తెలిసినా.. ఎంతో కష్టం అని తెలిసినా ప్రేమను వదులుకోకుండా జీవితాంతం ప్రేమను పంచడం వేరు..!

అలాంటి నిజమైన ప్రేమికుడి కథ ఇది..!

••••••••

కర్ణాటకకు చెందిన యువతి యువకుడు ఓ కంపెనీలో పనిచేసే టైమ్ లో ప్రేమలో పడ్డారు.. కలిసి జీవితమంతా ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.. ఇద్దరూ పేదింటి కుటుంబానికి చెందినవారే..! పెళ్ళికి అంతా సిద్ధం చేసుకుంటున్న సమయంలో.పిడుగులాంటి విషయం తెలిసింది.. అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి వైద్యం చేయించగా ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది..! ఈ విషయం తెలిశాక యువతి పెళ్లి విషయంలో పునరాలోచన చేసింది.. తాను ఎక్కువ రోజులు బ్రతికే పరిస్థితి ఉండదు కాబట్టి పెళ్ళిచేసుకుని తాను ప్రేమించిన యువకుడి జీవితాన్ని ఇబ్బందిలో పడేయకూడదని నిశ్చయించుకుంది.. అదే విషయాన్ని అతనితో చెప్పింది.. అయితే విషయం తెలిసిన తర్వాత కూడా యువకుడు వెనక్కి తగ్గలేదు.. స్వార్థంగా ఆలోచించలేదు..! ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమ జీవితాంతం ఎన్ని అవాంతరాలు ఎదురైనా కట్టుబడి ఉండాలనే తత్వం ఉన్నవాడు కాబట్టి పెళ్ళి చేసుకుందాం అని యువతికి తేల్చి చెప్పాడు.. కలిసి కష్టాలను అడిగమిద్దాం.. చివరి శ్వాస వరకు కలిసే బ్రతుకుదాం అని ప్రతిపాదించాడు..!


ప్రాణాంతక వ్యాధి ఉందని తెలిసినప్పటికీ తనతో కలిసి నడిచేందుకు సిద్ధపడిన ప్రేమికుడి ఔదార్యం.. గొప్ప మనసును చూసు యువతి చలించిపోయింది..!


ఉన్నన్నాళ్లు అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది.. అలా వారి జీవన ప్రయాణం కొనసాగుతోంది.. పేద కుటుంబం.. డబ్బులు లేవు.. అయినప్పటికీ ఒకరికి ఒకరు తోడుగా కష్టపడి బ్రతుకుతున్నారు.. డబ్బులు లేకపోయినా.. వచ్చిన దాంట్లో సర్దుకుపోతున్నారు.. ప్రేమగా సంతృప్తిగా సంతోషంగా బ్రతుకుతున్నారు.. !


నేటి తరం యువతకు ఇది ఆదర్శం..!

••••••••



ప్రేమించిన యువతికి బ్లడ్‌ క్యాన్సర్‌ ఉందని పెళ్లికి ముందే తెలిసినా అతడు వెనకడుగు వేయలేదు.స్వయానా ఆ యువతే వద్దని వారించినా.ఆమె మెడలో తాళి కట్టి గత పదకొండేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకొంటూ చికిత్స చేయిస్తున్నాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన విష్ణు, లక్ష్మి పీయూసీ వరకు చదివారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన వీరిద్దరూ రామదుర్గలోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో కలిసి పనిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత లక్ష్మికి ప్రాణాంతక బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయినా.2014లో విష్ణు ఆమెను పెళ్లాడాడు.లక్ష్మి చికిత్సకు ఇప్పటివరకు దాదాపు రూ.15 లక్షలు ఖర్చయ్యాయి.ఆమె ఎంతకాలం జీవిస్తుందో కచ్చితంగా చెప్పలేమని,పిల్లలు వద్దని వైద్యులు సూచించారు.ఈ జంట గురించి తెలిసి చిక్‌పేట్‌ మాజీ ఎమ్మెల్యే ఆర్‌.వి.దేవరాజ్‌ ఓ ఇల్లు ఇప్పించి అండగా నిలిచారు.ఆర్థిక ఇబ్బందులు,అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఈ దంపతులు స్థానిక మురికివాడ విద్యార్థులకు చదువు చెబుతూ..దాతల నుంచి సేకరించిన వస్త్రాలు పుస్తకాలు చెప్పులను వారికి పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఆ పిల్లలను స్థానిక దర్శనీయ ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు.ఈ దంపతులకు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.


••••••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page