top of page

ఇక కిలోల లెక్కన వెండి కొనలేరు..!

Writer: Writer Desk
Writer Desk
Jan 29
1 min read

కిలో వెండి అక్షరాల రూ.4.25లక్షలు..

అవును.. మీరు వింటుంది నిజమే..!

బంగారం కంటే వేగంగా వెండి పరుగులు పెడుతోంది...


గతంలో బంగారం ధరల పెరుగుదల ఒకేరోజు వేల రూపాయలు ఉండేది.. వెండి ధర వందల్లో ఉండేది..!


కానీ ట్రెండ్ మారింది...


ఇపుడు వెండి ధర కూడా రోజువారీగా వేల రూపాయలు ఉంటోంది...



కిలో వెండి ధర నాలుగు లక్షలు దాటడంతో ఇక వెండిని కూడా బంగారం మాదిరిగా తులాల లెక్కన ..గ్రాముల లెక్కన ధరలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది...వెండి ధర జనవరి నెలాఖరు వరకు నాలుగు లక్షలు దాటింది.. అదే తరహాలో పెరుగుదల కొనసాగితే తులం వెండి ధర వెయ్యికి చేరవచ్చు..!


బంగారం మాట దేవుడెరుగు.. వెండి కొనేంత తాహతు ఉంటే చాలనుకుంటారేమో మధ్యతరగతి ప్రజలు..!


గత పది రోజులలో ఏకంగా లక్ష వరకు వెండి ధరలో పెరుగుదల కనిపిస్తోంది.. జనవరి 20న కిలో రూ.3.40 లక్షలు ఉన్న ధర.. 29 న రూ.4.25 లక్షలకు ఎగబాకింది.. అంటే ఇప్పటికే రూ.85వేలు పెరిగింది..


గత పదిరోజులలో రోజువారీగా వెండి ధరలో పెరుగుదల ఎలా ఉందో కింద ఉన్న చార్ట్ ఇమేజ్ లో చూడండి..!



ఈ పెరుగుదలకు అడ్డుకట్ట పడేదెప్పుడో తెలియదు కానీ... నగలపై మక్కువ ఉండే మహిళలకు ఈ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది..!


•••••••


Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page