
తీసేయకపోతే సంగతి చూస్తా..! రష్మిక మాస్ వార్నింగ్..!
- Writer Desk

- 24 hours ago
- 2 min read
పెళ్ళి చేసుకున్న సంతోషం కూడా మిగల్చకుండా కొందరు రష్మికను చికాకు పరుస్తున్నారు...
ఆమె పాత ఆడియోలను ఇపుడు సోషల్ మీడియాలో పెట్టి లేనిపోని వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు..
పుష్ప సీక్వెల్ సినిమాలలో హీరోయిన్ గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మికా మందన్నా ఇటీవల హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే..!
2018 లో వచ్చిన గీతగోవిందం సినిమాలో విజయ్ రష్మిక తొలిసారి కలిసి నటించారు.. ఆ సినిమా నుండే ఇద్దరిమధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో ఇద్దరు కలిసి నటించారు...
అంతకుముందు కన్నడ హీరో రక్షిత్ షెట్టి ని రష్మిక ప్రేమించింది..పెళ్ళివరకు వెళ్ళింది.. కానీ 2017 లో ఎంగేజ్మెంట్ తర్వాత ఏర్పడిన విభేదాలతో ఏడాదిలోనే ఇద్దరు విడిపోయారు...!
ఆ తర్వాత విజయ్ తో గీత గోవిందం షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలోనే ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది..!

మొత్తానికి ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరు ఈ మధ్యనే పెళ్ళిచేసుకున్నారు... రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో గత నెల 26 న అత్యంత ఘనంగా వీరి వివాహం జరిగింది.. ఆ తర్వాత విజయ్ సొంతూరు లో కూడా రిసెప్షన్ గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు.. ఇంకా అవే కార్యక్రమాలలో ఇద్దరు బిజీగా ఉన్నారు.. అయితే అంతలోనే రష్మిక ఆనందాన్ని ఆవిరి చేసేలా కొందరు సోషల్ మీడియా వేదికగా రష్మిక.. ఆమె తల్లి సుమన్ మందన్నా మాట్లాడిన ఆడియో రికార్డింగ్ లను తాజాగా పోస్ట్ చేసి శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు...
తన జీవిత భాగస్వామితో కాస్త ఎంజాయ్ మూడ్ లో ఉన్న రష్మికకు ఈ వ్యవహారం చిత్రెత్తుకొచ్చేలా చేసింది...!
వెంటనే ఆ ఆడియోలు డిలీట్ చేయకపోతే పోస్ట్ చేసిన వారి సంగతి తెలుస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది... గత ఎనిమిదేళ్లుగా తప్పుడు ప్రచారాలపై ఎంతో ఓపిక పడుతున్నానని.. ఎప్పుడో దొంగచాటుగా రికార్డు చేసిన ఆడియోలను ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టీ
ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించే ప్రశ్నే లేదని ఆమె తేల్చి చెప్పారు..!
ఈరోజు మధ్యాహ్నం ఆమె సోషల్ మీడియా లో వార్నింగ్ లెటర్ ను పోస్ట్ చేసిన రష్మిక.. 24 గంటల డెడ్ లైన్ విధించారు...!
రేపటిలోగా డిలీట్ చేయని పక్షంలో సీరియస్ యాక్షన్ తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.
ఇంతకు ఆ ఆడియోలలో ఉన్న అంశాలేంటి అనే విషయంలో రకరకాల కథనాలు వినిపిస్తున్నారు...

రక్షిత్ షెట్టి రష్మిక ను ఎలా ఇబ్బంది పెట్టింది అనే విషయాలు అందులో ఆమె తల్లి ప్రస్తావించినట్లు తెలిసింది..!
మొత్తంగా కొత్త పెళ్ళికూతురు ఇంకా పెళ్లి జోష్ నుండి బయటకు రాకముందే.. ఆమెను ఇబ్బంది పెట్టేలా జరుగుతున్న పరిణామాలపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.. ఆమె పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేకనే కొందరు ఇలా చిల్లర చేష్టలు చేస్తున్నారని.. వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరముందని.. విజయ్ రష్మిక ఫ్యాన్స్ సహా వారిని అభిమానించేవాళ్ళు అభిప్రాయపడుతున్నారు..!
.....




Comments