
మూడేళ్ల తర్వాత రాష్ట్రంలో సిబిఐ..!
- Writer Desk
- 1 day ago
- 1 min read
సరిగ్గా మూడేళ్లకు సీబీఐ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..!
రాష్ట్రంలో సిబిఐ అనుమతిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది..!
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సిపి ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ అనంతరం.. విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్లు నిన్న ( ఆగస్టు 31 2025) ముఖ్యమంత్రి ప్రకటన చేసిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది..!
••••••

ఆనాటి బీ ఆర్ ఎస్ ప్రభుత్వం.తీసుకున్న నిర్ణయం..!
ఆగస్టు 30 2022 రోజు ప్రకటన!
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో నెం. 51ని జారీ చేసింది. గతంలో ఏ కేసు దర్యాప్తుకైనా సీబీఐకి ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది. ఈమేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 51ని జారీచేసింది. దీంతో ఇకపై సీబీఐ రాష్ట్రంలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సిబిఐ విచారణ పేరుతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందనే ఆలోచనతో నాడు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు..
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారాన్ని నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ రహస్య కెమెరాల ద్వారా వీడియోలు తీసి బయటపెట్టడం.. ఆ తర్వాత ఈ కేసు విచారణపై సిట్ ఏర్పాటు చేసి రాష్ట్రప్రభుత్వం విచారణ చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో సిబిఐ కి ఆంక్షలు విధిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..

.....
Comments