బంగారం వజ్రాల గణేశుడు అంటూ బురిడీ కొట్టించిన బేగం బజార్ వ్యాపారులు..!

అబ్బే అంత తూచ్..!
అది నిఖార్సైన గోల్డ్ కాదు..!
అవి వజ్రాలు అసలే కాదు..!
మూడు లక్షల వజ్రాలు పొదిగి.. ట్వంటీ ఫోర్ క్యారట్ పక్కా గోల్డ్...
48 కిలోల గణనాథుడి విగ్రహం అంటూ గొప్పలు పోయారు..!
అబ్బో పట్నంలోనే కాదు.. మొత్తం తెలుగు స్టేట్స్ లో ఖరీదైన విగ్రహం..!
పది మందికి పైగా కళాకారులు నెలల తరబడి రూపొందించారు అంటూ బడాయి మాటలు చెప్పారు..!
అబ్బో..! ఇంత ఖరీదైన విగ్రహం దొంగలు చోరీ చేస్తే ఎలా.. మళ్ళీ మాకే తిప్పలు అనుకున్నారు పోలీసులు.. అసలు ఇంతపాటి వజ్రాలు బంగారంతో అంత పెద్ద విగ్రహం అంటే మాటలు కాదు కదా... అసలు ఎవర్రా వీళ్ళంతా.. ఎక్కడినుండి వచ్చింది ఇంత డబ్బు అనుకున్నారేమో... ఎంక్వైరీ మొదలెట్టేశారు..!
విగ్రహం గురించి నిపుణుల చేత తనిఖీ చేయించగా అదంతా హంబక్ అని తేలిపోయింది..
పుత్తడి పూత చమక్ చమక్ రాళ్లతో పైపై పూత పూసి... పుత్తడి వజ్రాల అంటూ కలరింగ్ ఇచ్చారని పోలీసులు తేల్చి పడేశారు...!
అఫిషియల్ గా స్థానిక పోలీసులు ప్రకటన కూడా విడుదల చేశారు...
అట్లుంటది ఫెక్డు గల్లా కహానీ..!
దేవుడి విగ్రహంపైనే ఇంత ఫెకుడు మాటలు చెప్పిన ఈ వ్యాపారులు.. అసలు వ్యాపారంలో ఎంత ఫెకుడు మాటలు చెబుతున్నారో అనే అనుమానం ఇప్పుడు మొదలైంది..!
మరో పక్క ఇంకో ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.. బంగారం వజ్రాలు నిజమే కానీ... భద్రతా కారణాల దృష్ట్యా అలా పోలీసులు బయటకి చెప్పాల్సి వస్తుంది... మేం చెప్పింది అంతా నిజమే.. అది పుత్తడి విగ్రహమే.. అవి నిజమైన వజ్రాలే అంటూ రూపకర్తలు తెలిసినవాళ్ళకు చెబుతున్నారని సమాచారం..!
మొత్తం మీద దేవుడి విగ్రహం. విషయంలో ఇలాంటి ప్రచారాలు.. ఏది నిజమో అబద్దమో తెలియని పరిస్థితి మంచిది కాదని.. అందులోనూ గణనాథుడి విషయంలో పిచ్చి వేషాలు వేస్తే మట్టి కొట్టుకుపోతారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!
••••••

గోషామహల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రతిష్ఠించిన ‘లీ చీ కా రాజా గణేష్–2026’ విగ్రహంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని గోషామహల్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రవణ్‌కుమార్ సూచించారు. విగ్రహం పంచలోహంతో తయారైందని, 48 కిలోల బరువు, 24 క్యారెట్ల బంగారు పూతతోపాటు 3,83,800 అమెరికన్ వజ్రాలు పొదిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.
విగ్రహానికి బంగారు పూత పూయించారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నిర్వాహకులు వ్యాపార, వాణిజ్య ప్రయోజనాల కోసం ‘లీ చీ పెర్ల్స్ అండ్ జ్యువెల్స్’ను ప్రచారం చేసుకునేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనివల్ల విగ్రహం విలువ, స్వభావంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫొటోలు, వీడియోలు, సందేశాలను ధ్రువీకరించకుండా ఫార్వర్డ్ చేయొద్దని సూచించారు. బంగారు పూత, పంచలోహం, బరువు, వజ్రాల సంఖ్య వంటి వివరాలను అధికారికంగా నిర్ధారించిన తర్వాతే విశ్వసించాలని కోరారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో వదంతులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇన్‌స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు.
••••••••••
A Report By
Upender Bestha
99667 98930
••••••••••




Comments