
మహా దేవుడి మహా నిమజ్జనం..!
- Writer Desk

- Sep 6, 2025
- 1 min read
తల్లి చెంతకు మహా గణపయ్య..!
• ప్రశాంతంగా వైభవంగా శోభాయాత్ర..!
• ముగిసిన మహా గణపతి నిమజ్జనం..!
• జనసంద్రంగా మారిన ట్యాంక్ బండ్ పరిసరాలు..!
• పెద్ద గణేశుడి వీక్షణ కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులు..!
• అడుగడుగునా భద్రత..! డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా..!
• మహా నిమజ్జనోత్సవాలు పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. పోలీస్ అధికారులు!
......

హైదరాబాద్, సెప్టెంబర్ 06,2025 -
69 అడుగులతో నిర్మించిన ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శనివారం మధ్యాహ్నం గంగమ్మ ఒడికి చేరుకున్నాడు.
భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర జరుగగా, నిమజ్జనం కోసం
ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నం 4 వద్ద కు గణనాథుడు చేసుకున్నారు.
గణపతి బప్పా మోరియా అంటూ.. బై బై గణపయ్య అంటూ వీడ్కోలు.. భక్తులు వీడ్కోలు పలుకగా మధ్యాహ్నం గంగమ్మ తల్లి ఒడికి గణపయ్య చేరుకున్నారు.

మినిట్ టూ మినిట్ అబ్జర్వేషన్..!
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని సాఫీగా జరిగేలా పోలీసుల సహకారంతో జీహెచ్ఎంసీ ఆద్యాoతం
పర్యవేక్షించింది.

ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రం, నిమజ్జనం క్రతువును జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ చేస్తూ
సాఫీగా జరిగేలా క్షేత్ర అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, పోలీస్ సహకారంతో శోభాయాత్రను అద్భుతంగా, కన్నుల పండుగ జీహెచ్ఎంసీ సాగేలా చూసింది.

ఎన్ టి ఆర్ మార్గ్ బాహుబలి క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి కీలక నిమజ్జన క్రతువు పూర్తి అయ్యేలా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ లు దగ్గరుండి పర్యవేక్షించారు.

-----









Comments