జర్నలిస్టులకు ఫ్యూచర్ ఇచ్చిన ముఖ్యమంత్రి!

NEW SENSE exclusive
జర్నలిస్టుల కల సాకారం..!
జర్నలిస్టులకు ఫ్యూచర్ భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!
దసరాకి గొప్ప బహుమతి ప్రసాదించిన సీఎం
జర్నలిస్టుల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిన మహానుభావుడు రేవంత్ రెడ్డి..!
తెలంగాణ జర్నలిస్టులకు న్యాయం చేసిన మహా నాయకుడు రేవంత్..!
జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు..
మూడు వందల గజాల చొప్పున ఇచ్చేందుకు ఏర్పాట్లు..!
ఐపీఎస్ లకు.. ఎమ్మెల్యేలకు కూడా ఇంటి స్థలాలు!
ఫ్యూచర్ సిటీలో ఆవిష్కారం కానున్న జర్నలిస్ట్ విలేజ్..!
°°°°°°°°°°
*It appears that the entire process required to allocate housing plots to journalists, IPS officers, and MLAs in the 'Future City' is nearing completion.*
°°°°°°°°°°°
NEW SENSE Exclusive
దశాబ్దాల కల నెరవేరే రోజు వచ్చింది..!
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించబోతున్నారు..!
జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి.. వారి దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడానికి సిద్ధమయ్యారు..! జర్నలిస్టుల *ఫ్యూచర్* కి భరోసా ఇస్తూ *ఫ్యూచర్ సిటీలో* ఇంటి స్థలాలు ఇవ్వబోతున్నారు..!
ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్ల శరవేగంగా కార్యాచరణ పూర్తి చేశారు అధికారులు..!
తెలంగాణలో పెద్ద పండుగ దసరాకు శుభవార్త అందించే ఏర్పాట్లు చేస్తున్నారు..! అయితే దసరాకి ప్రకటిస్తారా.. ఇంకాస్త ఆలస్యం అవుతుందా అనే విషయంలో స్పష్టత లేదు కానీ... కచ్చితంగా త్వరలోనే ప్రకటన రావడం ఖాయం అని తెలుస్తోంది..!

ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులు, ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కావాల్సిన మొత్తం ప్రక్రియ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది..!
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పాలుపంచుకున్న జర్నలిస్టులకు గత పాలకులు అన్యాయం చేసిన మాట వాస్తవం..!
కానీ రేవంత్ రెడ్డి అలా కాదు అని నిరూపించుకుంటున్నారు.! నిజమైన న్యాయం చేస్తున్నారు..!
జర్నలిస్టులకు గరిష్ఠంగా మూడు వందల గజాల చొప్పున ఇంటి స్థలం..
ఐపీఎస్ లకు గరిష్టంగా 400-450 గజాలు ( ఇంకా స్పష్టత లేదు) ఇవ్వనున్నట్లు తెలుస్తోంది..!
ఎమ్మెల్యేలు మాత్రం తమకు 500 గజాల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది..!
అయితే ఎమ్మెల్యేల కోటాలో తనకు కూడా ఇంటి స్థలం వస్తుంది.. ఇక్కడ అందరికీ న్యాయం జరగాలనే కోణంలో ఆలోచించాలని సీఎం ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలుస్తోంది..!
అందరికీ ఒకేసారి ఇస్తారో లేదో తెలియదు కానీ.. జర్నలిస్టులకు మాత్రం ముందుగా అనుకున్న సమయంలోనే ఇవ్వాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం..!
దశాబ్దాల జర్నలిస్టుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఒక భరోసా కల్పించడానికి సహృదయంతో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి.. మంత్రులకు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వదా జర్నలిస్టులు కృతజ్ఞత ప్రకటించాల్సిన శుభ సందర్భం త్వరలోనే....
••••••••
A Special Report By
ShyamaSundar Akula
NEW SENSE
••••••••




Comments