top of page

బెంగళూరు పోలీసులపై ఆంధ్రా ఐఏఎస్ దాడి..!

Writer: Writer Desk
Writer Desk
2 days ago
2 min read

  • పబ్ కి వెళ్లి గబ్బు చేసిన ఆంధ్రా ఐఏఎస్..!

  • సీఎం చంద్రబాబు ఇలాకా కుప్పంలో ఏరియా అధికారిగా ఉన్న ఐఏఎస్ వికాస్..!

  • బెంగుళూర్ లోని ఓ పబ్ లో అర్ధరాత్రి హల్చల్..!

  • స్నేహితులతో కలిసి పోలీసులపై దాడి యత్నం..!

  • ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన పోలీసులు..!

  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు..!

  • ఆంధ్రాలో సంచలనంగా మారిన వికాస్ వ్యవహారం..!


బెంగళూరులోని ఒక పబ్‌లో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహా పోలీసు సిబ్బందిపై దాడి..! వారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు..బూతులు తిడుతూ దాడి చేసిన ఐఏఎస్..అతని వెంట వచ్చిన ముగ్గురిపై కూడా కేసులు నమోదయ్యాయి..!

బెంగళూరులో జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి  ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ వికాస్ మర్మాట్ పై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది..!


ఏపీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో.. ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మాట్ మరియు అభయ్ ఉదయ్ సింగ్, నితీష్, రోషన్ అనే ముగ్గురు వ్యక్తులపై అక్టోబర్ 10న బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కేసు నమోదు చేశారు..! స్నేహితులతో కలిసి పబ్ కి వెళ్ళిన వికాస్.. తనను పోలీసులు తనిఖీ చేయడాన్ని సహించలేక పోయాడు.. నేను ఐ ఏ ఎస్ అధికారిని.. నన్నే తనిఖీ చేస్తారా అంటూ పోలీసులపై జులుం ప్రదర్శించాడు.. అయితే తమ డ్యూటీ తమని చేసుకొనివ్వాలని పోలీసులు తేల్చి చెప్పారు..! దీంతో వారిని అడ్డుకోవడమే కాకుండా.. స్నేహితులతో కలిసి బూతులు తిడుతూ వారిపై అరవడం మొదలెట్టాడు.. అతని స్నేహితులు కూడా పోలీసులపై దూషణలకు తెగబడ్డారు.. అయినప్పటికీ పోలీసులు తనిఖీలు ఆపకపోవడంతో మరింత రెచ్చిపోయిన వికాస్.. అతని స్నేహితులు పోలీసులతో ఘర్షణకు దిగి వారిపై భౌతిక దాడికి ప్రయత్నించారు..! ఈ తతంగాన్ని వీడియో తీసిన పోలీసులు.. నేరుగా స్థానిక పోలీసు స్టేషన్ లో సమర్పించారు..!



 ఎఫ్‌ఐఆర్ వివరాల ప్రకారం... 

 ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఈ ఘటన అక్టోబర్ 10న అర్ధరాత్రి 1 గంట నుండి 1:30 గంటల మధ్య కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెసిడెన్సీ రోడ్‌లో ఉన్న 'కావోర్' అనే బార్ మరియు రెస్టారెంట్‌లో జరిగింది.

ఘటనపై ఫిర్యాదు చేసిన బెంగళూరు నగర పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) ప్రత్యేక విచారణ విభాగం ఇన్‌స్పెక్టర్ అరుణ్ సలుంకే మాట్లాడుతూ.. బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కబ్బన్ పార్క్ మరియు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బార్‌లు, రెస్టారెంట్లలో తాను మరియు తన బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.! అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటలకు 'కావోర్' (Cavore) వద్దకు చేరుకుని.. పబ్ కు వచ్చిన వారి వయస్సును నిర్ధారించడానికి వారి గుర్తింపు కార్డులను పరిశీలిస్తుండగా.. నలుగురు వ్యక్తులు పోలీసు సిబ్బందితో గొడవకు దిగారు..! అసభ్య పదజాలం ఉపయోగించడమే కాకుండా.. తనిఖీల్లో పాల్గొన్న ఇన్‌స్పెక్టర్ మరియు ఆయన సహచర సిబ్బందిపై భౌతిక దాడి చేసారు.. తీవ్రంగా బెదిరింపులకు పాల్పడ్డారు..! విధులకు అడ్డు తగిలారు..! దీంతో వారిపై చట్టప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశామని అరుణ్ సలుంకే తెలిపారు..!


ఐఏఎస్ పై నమోదైన కేసులు ఇవే..!

బీఎన్ఎస్ 2023లోని సెక్షన్లు 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 351(2) (నేరపూరిత బెదిరింపు), 352 (శాంతిభద్రతలకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 132 (ప్రభుత్వ ఉద్యోగిని విధి నిర్వహణ నుండి అడ్డుకోవడానికి దాడి చేయడం లేదా నేరపూరిత బలాన్ని ప్రయోగించడం) మరియు 3(5) (ఉమ్మడి ఉద్దేశం) కింద కేసులు రిజిస్టర్ చేయబడ్డాయి..!

••••••


A Report By

ShyamaSundar Akula

NEW SENSE


•••••••

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page