top of page

సొంత తండ్రిని తమ్ముడితో కలిసి హతమార్చిన ప్రభుత్వ టీచర్..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 20 hours ago
  • 1 min read

  • ఇద్దరి ప్రాణాలు తీసిన వేప చెట్టు వివాదం..!


  • సొంత తండ్రిని చంపిన ప్రభుత్వ టీచర్..!


  • భర్తను చంపడానికి సహరించిన భార్య..!



సూర్యాపేట జిల్లా మేళ్ళచెరువు పరిధిలోని ఎర్ర గట్టు తండాలో దారుణం..!


పెదబాబు అనే వ్యక్తి స్థానికంగా యాదవులు పూజించే ఓ దేవతా వృక్షాన్ని కూల్చివేయించే ప్రయత్నం..!


ఈ క్రమంలో పెదబాబు అనే వ్యక్తి కుటుంబానికి.. యాదవులు సహా తండావాసులందరికీ మధ్య గత ఇరవై ఐదు ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది..!


యాసిడ్ సహా పలు రసాయనాలు పోస్తూ చెట్టు జీవం తీసి కూల్చివేయడానికి పెదబాబు సహా ఆయన కుటుంబ సభ్యులు చేసిన చర్యలను తండావాసులు తీవ్రంగా వ్యతిరేకించారు..!



తాజాగా చెట్టు మొత్తం.యాసిడ్ రసాయనాల ప్రభావంతో చెట్టు వేర్లు మోడువారిపోయి చెట్టుకూలిపోయింది..!


దీంతో తీవ్ర ఆవేదనకు గురైన యాదవుల పెద్ద వెంకటేశ్వర్లు అలా ఎందుకు చేశారని ప్రశ్నించిన పాపానికి పెదబాబు.. ఆయన కుమారులు కలిసి వెంకటేశ్వర్లుపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.! గొడ్డలితో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు..!


వృద్ధుడైన వెంకటేశ్వర్లుపై దాడిని స్వయంగా పెదబాబు తండ్రి సైదా భూక్యా అడ్డుకునే ప్రయత్నం చేయగా.. సొంత తండ్రి అని కూడా చూడకుండా పెదబాబు l.. ఆయన సోదరుడు రాము కలిసి స్థానిపైనా గొడ్డలితో దాడి చేయడంతో అతను కూడా తీవ్ర గాయాలపాలై చనిపోయాడు..! కుమారుల మారణ కాండకు సొంత తల్లి సహరించిందని.. తన కళ్ళ.ముందే కన్న బిడ్డలు భర్తను దారుణంగా నరికి చంపుతుంటే అడ్డుకోవాల్సింది పోయి.. సహరించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..!


ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ టీచర్ అయిన పెదబాబు వ్యవహార శైలీ ఓ ఉన్మాది మాదిరిగా ఉంటుందని తండావాసులు చెబుతున్నారు..! ఆయన ఉన్మాద చర్యల వల్లే ప్రభుత్వం ఇతన్ని సస్పెండ్ చేసిందని తెలిపారు..! తండాలో అందరితో గొడవలు పడటం.. నిందలు వేసి వేధింపులకు గురిచేయడం ఆయన కుటుంబ సభ్యులకు నిత్యకృత్యంగా మారిందని తండావాసులు ఆరోపిస్తున్నారు..!



ఎస్సై నవీన్ పై రాళ్ళ దాడి..!

స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన ఎస్సై నవీన్ పై పెదబాబు కుటుంబసభ్యులు రాళ్లు విసిరి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి...!


అయినప్పటికీ ఎస్సై వీధుల్లోనే ఉన్నట్లు జిల్లా పోలీసు అధికారులు న్యూ-సెన్స్ కు తెలిపారు..!


దారుణ మరణకాండతో తండాలో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి..!


చుట్టుపక్కల తండాలు గ్రామాల వాసులు కూడా భయాందోళనలకు గురవుతున్నట్లు సమాచారం..?


హంతకులు పెదబాబు రాము.. వారి తల్లిని పోలీసులు అరెస్ట్ చేసారు..!


తండాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారిని మరోచోటికి తరలించినట్లు తెలుస్తోంది..!


••••••••••

A Breaking Report By

ShyamaSundar Akula

9010746999

••••••••••


••••

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page