వీధుల రోడ్లు అడ్డంగా కబ్జా చేసిన జక్కిడి..!
- Writer Desk

- 2 minutes ago
- 2 min read
అవును అక్రమిస్తా.. నన్నెవడేం చేస్తడు..?
జక్కిడి సుదర్శన్ రెడ్డి రుబాబు..!
ప్రభుత్వ భూమిని ఆక్రమించి దర్జాగా గోడలు కట్టేసి అడ్డంగా ఆక్రమణ..!
తన స్కూల్ ప్రాంగణంలో కలిపేస్తూ ప్రహరీ గోడ..!
కాలనీవాసులకు బెదిరింపులు..!
అధికారులకు బెదిరింపులు..!
హైడ్రా జీహెచ్ఎంసీ..రెవెన్యూ వాళ్ళు నన్ను ఏమీ చేయలేరని అంటున్న జక్కిడి..!
రాజకీయ పలుకుబడి ఉంది..మేమేం చేయలేమంటున్న అధికారులు..!
హైడ్రా అధికారులు వచ్చి చూసినా చర్యలు లేవు..!
ఎల్బీనగర్ అడ్డాగా జక్కిడి కుటుంబం అక్రమాలు అరాచకాలు శృతి మించుతున్నాయి..!
రాజకీయంగా ఒక వైపు.. భూముల ఆక్రమణ మరోవైపు.. అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు జక్కిడి సోదరులు.!
జక్కిడి సుదర్శన్ రెడ్డి యాజమాన్యంలో ఎల్బీ నగర్ సెంట్రల్ బ్యాంక్ కాలనీలో నిర్వహిస్తున్న స్కూల్ పక్కన ఉన్న నాలాను పూర్తిగా ఆక్రమించేశారు. మరోవైపు ఉన్న వీధి రోడ్డు కూడా సగం వరకు ఆక్రమించి.. ఇటు నాలా రోడ్డు.. అటు వీధి రోడ్డును కబళిస్తూ మొత్తంగా స్కూల్ ప్రహరీ గోడ కట్టుకున్నాడు..!
జీహెచ్ఎంసీ నాలాను ఈమధ్యనే దాదాపు రెండు కోట్ల వ్యయంతో ఆధునీకరించి సిమెంట్ సీసీ రోడ్డు వేసింది.. మ్యాన్ హోళ్ళకు గ్రిల్ క్యాపులు కూడా బిగించింది.. ఆధునీకరణ పనులు పూర్తయ్యేవరకు వేచి చూసి ఆ పనులు అయిన వెంటనే జక్కిడి సుదర్శన్ రెడ్డి నాలా మీదుగా ఉన్న అప్రోచ్ రోడ్డు మొత్తంగా ఆక్రమిస్తూ వీధికి అడ్డంగా గోడ కట్టేశాడు..!
టీ జంక్షన్ మాదిరిగా కలిసే మరో వీధి రోడ్డును కూడా సగం వరకు ఆక్రమించి గోడ కట్టేశాడు..! ఈ వీధిలో ఉన్న రెండు కరెంటు స్థంభాలు కూడా తన స్కూల్ పరిధిలో కలిపేసుకున్నాడు..!
రెండు వైపుల ఆక్రమణ.చేసిన భూమి విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు..!

స్థానికులకు బెదిరింపులు..!
సర్వే నంబర్ 4 నుండి 11 వరకు ఉన్న వరుస నంబర్ల పరిధిలో రెండు వేల గజాల పైచిలుకు స్థలం ఉంది..! వర్షం నీరు వెళ్ళేందుకు వీలుగా అండర్ గ్రౌండ్ లైన్ ఏర్పాటు చేసి.. పైన సీసీ రోడ్డు వేసి గ్రిల్డ్ మ్యాన్ హోల్ అక్కడక్కడా ఏర్పాటు చేశారు.!
వీధి నుండి కాలనీ మెయిన్ రోడ్ వరకు ఈ నాలాపైన ఉన్న అప్రోచ్ రోడ్డు పైనే వెళ్తుంటారు స్థానికులు.. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి వీధి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం వల్ల.. సెంట్రల్ బ్యాంక్ కాలనీ వాసులు దాదాపు రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది..! రెండో వైపు కూడా ఇదే పరిస్థితి..!
జక్కిడి సుదర్శన్ రెడ్డి ఆయన సోదరుల భూ ఆక్రమణల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు.. స్థానికులు ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు.. జక్కిడి సోదరుల అరాచక దాడులు బెదిరింపులకు భయపడి మౌనంగా ఉంటూ ఇబ్బందులు భరిస్తున్నామని కొందరు స్థానికులు న్యూ-సెన్స్ ముందు వాపోయారు..! ఒకవేళ తాము అక్రమాలపై ఇబ్బందులపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోగా.. అధికారులు వెంటనే జక్కిడి సోదరులకు సమాచారం ఇచ్చి మాకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..! గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి కాబట్టి నోరుమూసుకుని ఉండటమే మంచిదనే ఆలోచనతో ఉన్నామని.. మున్సిపల్ వాటర్ వర్క్స్ రెవెన్యూ అధికారులు కూడా జక్కిడి సోదరులకు అమ్ముడు పోయారని..వారు ఆరోపిస్తున్నారు..!

మున్సిపల్ అధికారుల డ్రామా..!
జక్కిడి సుదర్శన్ రెడ్డి స్కూల్ పరిధిలోని ప్రభుత్వ నాలా వీధి రోడ్డు దాదాపు రెండు వేల గజాల మేర అడ్డంగా గోడకట్టి ఆక్రమించిన విషయం తెలిసి కూడా మున్సిపల్ అధికారులు డ్రామా ఆడుతున్నారు..! అడ్డంగా గోడలు కట్టి రెండు వైపుల ఆక్రమణలు జరిగిన విషయంపై న్యూ - సెన్స్ వివరణ కోరగా.. చూస్తాం చేస్తాం అంటూ దాటవేస్తున్నారు.. స్థానికులు ఆరోపించినట్లుగానే అధికారుల తీరు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.!
మున్సిపల్ అధికారులతో సహా రెవెన్యూ అధికారులు జలమండలి విద్యుత్ అధికారులు కూడా ఇదే తరహాలో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు..! ఏదైనా ప్రశ్నిస్తే మా కష్టాలు మాకు ఉంటాయి అధికార పార్టీ రాజకీయ నాయకులను మేమేం చేయలేం కదా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు..
మొత్తంగా చూస్తే జక్కిడి సుదర్శన్ రెడ్డి సోదరులు రాజకీయ పలుకుబడితో అధికారులను కూడా బెదిరిస్తూ వారి చెప్పు చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది..! మరోవైపు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేయగా స్థానికంగా వచ్చి పరిశీలించిన హైడ్రా అధికారి .. సిబ్బంది రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు..!
ఇప్పటికైనా రెండు వైపులా అడ్డు గోడలు కూల్చి ప్రభుత్వ స్థలం జక్కిడి సోదరుల కబ్జా నుండి విడిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..!
••••••••
A Report By
ShyamaSundar Akula
9010746999
••••••••




Comments