top of page

జీవితంలో ఎక్కడ తగ్గాలో చూసుకో పవన్..!

Writer: Writer Desk
Writer Desk
11 minutes ago
2 min read

అందరికీ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..ఫ్యాన్స్ ను పూర్తిగా ఆత్మరక్షణలో పడవేశారు..!


విడాకులు వివాహాలు వ్యక్తిగతమే కావచ్చు..! కానీ సమాజానికి నాయకత్వం వహించే స్థాయి వ్యక్తుల జీవన వ్యక్తిగత వ్యవహారాలపై కూడా ప్రజల్లో ఒక ఆసక్తి దృష్టి ఉంటుంది. !


నాయకుల వ్యక్తిగత వ్యవహారాలు..నడవడిక కూడా ఇక్కడ అత్యంత ప్రధానమైనది. !


పవన్ కళ్యాణ్ తనకు ఎంతో ఓపిక సహనం ఉంటాయి అంటూ చెప్పుకుంటారు..!


కానీ అవన్నీ నిజం కాదని మరోసారి స్పష్టమైంది. !

.వైవాహిక బంధాలలో వచ్చే విబేధాలు వివాదాలను సమస్యలను ఓపికగా తట్టుకుని నిలబడలేని వ్యక్తి పరిష్కరించుకోలేని వ్యక్తి ప్రజలను ఎలా పాలించగలడు.. ఎలా మార్గదర్శిగా నిలబడగలరు అనే ప్రశ్న అడుగడుగునా తలెత్తుతుంది..!


మిగతా వివాహాలు అంతర్గత విషయాలు అంత ప్రస్పుటంగా బయటకు కనిపించలేదు..రెండవ భార్య రేణూ దేశాయి కూడా సినీ నటి కావడంతో వారి విడాకుల వ్యవహారంపై కాస్త ఎక్కువగా చర్చ జరిగింది..!


కానీ సోషల్ మీడియా విస్తృతి తర్వాత పవన్ - అన్నా లెజినోవా వైవాహిక బంధంపై ఎక్కువగా సమాచారం బయటకు వచ్చింది.!



విదేశీయురాలు అయినా పవన్ పై ఆమె చూపించిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంది..!


తన సంప్రదాయాలను గౌరవిస్తూనే భర్త మతం సంప్రదాయాలను పూర్తిగా అనుసరిస్తూ ఆచరిస్తూ సంప్రదాయమైన తెలుగింటి కోడలిగా మన్ననలు పొందారు లెజినోవా..!


కష్టకాలంలో భర్తకు అండగా నిలిచారు..!


దైవాన్ని ఎక్కువగా విశ్వసించే అన్నా కుమారుడి ప్రమాదం..భర్త అనారోగ్యం సమయంలో దేవుడిని మొక్కుకున్నారు..! తర్వాత మొక్కలు చెల్లించుకున్నారు..!


గర్భం దాలిస్తేనే అందం ఆరోగ్యం చెడిపోతుందని భావించే తెలుగు సెలబ్రిటీలను మనం చూస్తున్నాం.. సరోగసి ద్వారా బిడ్డలను కంటున్న దరిద్రపు స్థితిలో ఆలోచనలు ఆచరణలు ఉన్న పరిస్థితుల్లో.. అన్నా దైవ క్షేత్రంలో తలనీలాలు ఇచ్చారు..! తిరుమల కొండకు నడిచి వెళ్ళారు..! తన అందం ముఖ్యం కాదు కుటుంబం.. దైవ కృప ముఖ్యం అనుకున్నారు..తాను ఎలా ఉన్నా పర్వాలేదు..భర్త బిడ్డలు బాగుండాలి అనుకున్నారు కాబట్టే కదా గుండు చేసుకుని కాస్త అంద వికారంగా కనిపించినా సహించారు.!


నిజానికి అన్నా లెజీనోవా వేరే మతానికి చెందిన వారు.. కానీ భర్త విశ్వసించే సనాతన ధర్మానికి కట్టుబడి నడుకున్నారు..హైందవ ఆధ్యాత్మిక సంస్కృతిని ఆచరించారు.. అదికూడా మొక్కుబడిగా కాదు..!మనస్పూర్తిగా పూజలు చేశారు..! అదే పవన్ కళ్యాణ్ మాత్రం.. సనాతన ధర్మ ఆచారకుడిని..ప్రచారకుడిని అన్నట్లుగా చెప్పుకుంటూ.. వాస్తవ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించారు..!


పవన్ కళ్యాణ్ స్థిర చిత్తం లేని మనిషి అని మరోసారి స్పష్టంగా నిరూపించుకున్నారు..!


ఆయనేం యువకుడు కాదు మళ్ళీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకోవడానికి..చిన్న చిన్న మనస్పర్థలతో భార్యలను వదిలేయడానికి..!


కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది.. అరవైకి చేరువైన వ్యక్తికి కుటుంబపరంగా ఒక తోడు లేకుంటే ఎలా..? భార్యలను దూరం చేసుకోవడం వల్ల..పిల్లలు కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి..! ఒక తండ్రిగా ఆయన వాళ్లకేం సమాధానం చెప్పుకోగలడు..? సెలబ్రిటీ సినీ నటుడిగా అగ్రశ్రేణి స్థానం.. రాజకీయాల్లో కూడా ప్రముఖంగా ఎదిగాడు.. ప్రజాదరణతో ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని సాధించారు..! ఈదశలో ఇలాంటి చర్యల వల్ల అన్నివిధాల నష్టపోయేది పవన్ మాత్రమే.. అన్నా లెజీనోవా కు ప్రజల్లో.. ముఖ్యంగా మహిళలలో ఎంతో ఆదరణ అభిమానం ఉన్నాయి.. ఆమె నడవడికతో.. బాధ్యతాయుతమైన మహిళగా అందరి ప్రశంసలు అందుకున్నారు..! పవన్ ను తీవ్రంగా వ్యతిరేకించే వారు సైతం లెజినోవా విషయంలో ఒక మంచి అభిప్రాయంతో ఉంటారు.. ఆమె భార్యగా లభించడం పవన్ అదృష్టం అంటూ ప్రత్యర్థులు కూడా అభిప్రాయపడిన సందర్భాలు ఎన్నో..!


పవన్ తాజా నిర్ణయం అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది...



అన్నా లెజినోవా లాంటి ఉత్తమ ఇల్లాలును వదిలించుకుని తమ అభిమాని ఏంచేస్తాడు.. ఏం చేసినా అలాంటి ఇల్లాలు పవన్ జీవితంలో మరొకరు ఉండరు.. ఇది నిజంగా తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు..!


పవన్ ఇపుడు ప్రజల దృష్టిలోనే కాదు.. అభిమానుల దృష్టిలో కూడా ఒక చంచలమైన మనస్తత్వం..మానసిక స్థిరత్వం.. భారతీయ కుటుంబ విలువలను గౌరవించలేని హీనత్వం కలిగిన వ్యక్తిగా ముద్రపడిపోయారు..!


ఇప్పటికైనా మించిపోయింది లేదు..! మళ్ళీ అన్నా లెజినోవా తో తలెత్తిన విభేదాలను కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని..! ఆమె చూపించే ప్రేమ జీవితాంతం కొనసాగేలా చూసుకోవాలని..ఈ విషయంలో పవన్ ఎంత తగ్గితే అంత మంచిదని అభిమానులు సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు..!



•••••••

A Report By

Shyama Sundar Akula

9010746999


Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page