top of page

తులం లక్షన్నర..! కిలో మూడు లక్షలు..!

Writer: Writer Desk
Writer Desk
Jan 19
1 min read

దేశంలో మరోసారి బంగారం వెండి ధరలు అమాంతం పెరిగాయి...

తులం నిఖార్సైన బంగారం (24 క్యారెట్లు)ధర సోమవారం రూ.1900 కి పైగా పెరిగి ప్రస్తుతం ₹1.45 లక్షలు ₹145690) వద్ద కొనసాగుతోంది

ఇక కిలో వెండి ధరలో పెరుగుదల సోమవారం వరకు ఏకంగా ఎనమిదివేలు కనిపించింది... ప్రస్తుతం కిలో వెండి ధర రూ.మూడు లక్షల పద్దెనిమిది వేలు పలుకుతోంది..!

మొత్తంగా రోజుల వ్యవధిలోనే వెండిధర లక్ష వరకు పెరిగింది..!



కారణం ఇదేనా..!

గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఎనిమిది యూరోపియన్ దేశాలపై కొత్త సుంకాలను విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరికలు చేసిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి...


సోమవారం బంగారం ధర ఔన్సుకు $4,689.39 (£3,499) కు చేరుకోగా, వెండి ఔన్సుకు $94.08 గరిష్ట స్థాయికి చేరుకుంది.



సామాజిక రాజకీయ సంక్షోభాలు..అనిశ్చితి తలెత్తిన సమయాల్లో ఇతర పెట్టుబడులపై ఉన్న నిధులను కార్పొరేట్లు బ్యాంకులు.. ప్రజలు కూడా

బంగారం వజ్రాలు వెండి తదితరాల విలువైన లోహాల కొనుగోలు వైపు మళ్లిస్తారు.. వాటిని సురక్షితమైన ఆస్తులుగా భావిస్తారు. ఇక గత సంవత్సరం నుండి మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి


అమెరికా అదనపు సుంకాలు విధిస్తామని బెదిరించిన నేపథ్యంలో గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో పెట్టుబడాన్ని బంగారం వెండిపై మళ్లించారని.. అందువల్లే గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు..


అమెరికా ఈయూ మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావం బంగారం వెండి సహా విలువైన లోహాలపై పడుతోందని... ఆ సంక్షోభం సద్దుమణిగే వరకు రేట్ల పెరుగుదల కొనసాగవచ్చని దేశీయ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు..


..

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page