top of page

శ్రీవారి చెంతకు సింఘాల్..!

Writer: Writer Desk
Writer Desk
Sep 8, 2025
1 min read

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిగా అనీల్ కుమార్ సింఘాల్ ను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..! ఈరోజు ప్రకటించిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆయనను టీటీడీ ఈవో గా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


గతంలో కూడా ఆయన చాలాకాలం టీటీడీ ఈవో గా సేవలందించారు...


నిజాయితీ.. దైవభక్తి గల అధికారిగా ఆయనకు పేరుంది...


టీటీడీ ఈవో గా తొలిసారి 2017 లో నాటి చంద్రబాబు ప్రభుత్వం నియమించింది.. అయితే తెలుగు వాడికి కాకుండా ఉత్తరాదికి చెందిన అధికారిని ఈవో గా నియమించారని విమర్శలు వచ్చాయి..

అయితే ఆయన మ్యాటర్ తన నిజాయితీతో మూడేళ్లలో మంచి పేరు తెచ్చుకున్నారు..


2020 లో ఆయనను టీటీడీ నుండి బదిలీ చేశారు.


మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే సింఘాల్ ను తిరిగి టీటీడీ ఈవో గా నియమించడం విశేషంగానే భావించాలి...


టీటీడీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన ప్రభుత్వం అందులో భాగంగానే సింఘాల్ ను మళ్లీ ఈవో గా నియమించినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి...!


....

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page