top of page

ముగ్గురు కన్నబిడ్డలను చంపేసి..

Writer: Writer Desk
Writer Desk
Sep 4, 2025
1 min read

వీడిని పిల్లల మిస్సింగ్ మిస్టరీ..!

• పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!

• ఎర్రగొండపాలెం పిల్లల మిస్సింగ్ ఘటన విషాదాంతం..!

• తెలంగాణ పరిధిలోని నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో పిల్లలను హత్య చేసిన తండ్రి..!

......

హైదరాబాద్ :

వెల్దండ మండలం అచ్చంపేట కు ముగ్గురు పిల్లలతో ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ ఎరువుల వ్యాపారి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకోగా.. పిల్లల ఆచూకీ లభించలేదు. ఈ ఘటన బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. యర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు (38/కు భార్య దీపిక, కుమార్తెలు మోక్షిత(8), రఘవర్షిణి (6), కుమారుడు శివధర్మ(4) ఉన్నారు. ఆయన ఎరువుల దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. అయితే, గతనెల 30న సాయంత్రం 5 గంటలకు పాఠశాలకు వెళ్లిన ముగ్గురు పిల్లలను వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. అనంతరం ఇంటికి ఆయన తిరిగి రాకపోవడంతో భార్య యర్రగొండపాలెం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


చిన్నారుల కోసం డ్రోన్ లతో గాలింపు..చిన్నారుల డెడ్ బాడీలు లభ్యం..!


తండ్రితో వచ్చి అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఆగస్టు 31న అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ నుంచి అచ్చంపేట మండలంలోని హాజీపూర్ మీదుగా నల్గొండ జిల్లా డిండి వైపు వెళ్లినట్లు తెలుసుకున్నారు. దీంతో అప్రమత్తమై అచ్చంపేట, ఉప్పునుంతల ఠాణాలకు చెందిన పోలీసులు డ్రోన్ కెమెరా సాయంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారికి ముగ్గురు పిల్లల డెడ్ బాడీలు కనిపించాయి..


తండ్రి ఆత్మహత్యకు ముందు ముగ్గురు పిల్లలను హతమార్చినట్లు పిల్లల శరీరాలపై ఉన్న గాయాల ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.


Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page