top of page

వేణుస్వామిని బయటకు తరిమేసారు..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Aug 20, 2025
  • 1 min read

కామాఖ్య ఆలయంలో అతివేషాలు..!

అనుమతి లేకుండా పూజలకు ప్రయత్నం..!

డబ్బు వసూళ్లపై ఫిర్యాదులు..!

అడ్డుకుని బయటకు తరిమేసిన అర్చకులు!

వీడియో వైరల్!

హైదరాబాద్: వివాదాస్పద జ్యోతిష్యుడు... దొంగ జ్యోతిష్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేణు స్వామిపై ప్రసిద్ధ కామాఖ్య ఆలయం అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆలయం నుండి ఒక విధంగా బయటకి తరిమేశారు...


అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరం పరిధిలోని నిలాచల కొండలలో దేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా కామాఖ్య దేవాలయానికి పేరు...


అష్టాదశ శక్తి పీఠాల తర్వాత..ప్రాముఖ్యమైన 51 శక్తిపీఠాలలో కామాఖ్య దేవాలయం ప్రాచీనమైనది...


మాంత్రిక తాంత్రిక పూజలకు ప్రసిద్ధి..


తాంత్రిక పూజల ద్వారా.. అతీంద్రియ శక్తులు పొందుతారని.. తద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మిస్తూ ప్రజల నుండి పెద్ద మొత్తంలో వసూల్ చేసే పూజారులలో వేణు స్వామి కూడా ఒకరు...


ఆయన తాజాగా కామాఖ్య ఆలయానికి వెళ్ళి అక్కడ తాంత్రిక పూజలకు ప్రయత్నించగా.. అక్కడి పూజారులు అడ్డుకున్నట్లు తెలిసింది...


కామాఖ్య ఆలయంలో పూజల పేరుతో పెద్దమొత్తంలో వేణుస్వామి డబ్బులు వసూలు చేస్తూ నట్లుగా ఫిర్యాదులు రావడంతో ఆలయ అర్చకులు అప్రమత్తమైనట్లు తెలిసింది.. ప్రధానాలయం ఎలాంటి పూజలు నిర్వహించకుండా వేణు స్వామి నీ అడ్డుకోవడంతో పాటు..ఆయన చేస్తున్న పూజల గురించి నిలదీసినట్లు తెలిసింది. .


అయితే అర్చకులను వేణుస్వామి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడంతో... వారు మరింత ఆగ్రహానికి గురయ్యారని.. వేణు ను బలవంతంగా బయటకు పంపించివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు..


కొందరు స్థానికులు అర్చకులు వేణుస్వామిని ప్రశ్నిస్తూ అడ్డుకున్న వైనాన్ని మొత్తం సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియా లో వైరల్ చేసినట్లు తెలిసింది...


....

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page