top of page

ఎవరినీ ఉపేక్షించం - ముఖ్యమంత్రి హెచ్చరిక

Writer: Writer Desk
Writer Desk
Aug 29, 2024
1 min read

హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు.

గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం హెచ్చ‌రించారు.


ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page