ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్ డిస్మిస్
- Writer Desk
- Aug 29, 2024
- 1 min read
ఓటుకు నోటు కేసు ట్రయల్ బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషన్‌కు కొట్టివేసింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఓటుకు నోటు కేసుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగించింది సుప్రీంకోర్టు. దీనిపై గురువారం న్యాయస్థానంలో వాదోపవాదనలు జరిగాయి. అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. ప్రతీ ఒక్కరి మనసులో విశ్వాసం ఉండేలా మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమించామని జస్టిస్ గవాయ్ తెలిపారు.
2024 ఎన్నికల తర్వాతే మీరు కోర్టుకు వచ్చారని, ఎందుకని పిటిషనర్‌ని ప్రశ్నించింది. ఏపీ లేదా తెలంగాణ నుంచి ఒకరిని స్పెషల్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తామని తెలిపింది. దీనిపై మధ్యాహ్నం రెండు గంటలకు ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. దేశంలోని ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై కేసులు నమోదైతే వాటిని పాకిస్థాన్ కు బదిలీ చేయాలా అని కోర్టు ప్రశ్నించింది.
Comments