top of page

ఫార్టీ9 లో ఏఐ ఆధారిత మేల్ ఫెర్టిలిటీ టెస్టింగ్..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Jul 25
  • 2 min read

*ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం సందర్బంగా ఫర్టీ9లో ఏఐ ఆధారిత మేల్ ఫెర్టిలిటీ టెస్టింగ్ ప్రారంభం..!


నటి లయ, ఫెర్టీ9 సేవ పొందిన దంపతులతో కలిసి తొలి సాంకేతిక మైలురాయిని ఆవిష్కరించారు


హైదరాబాద్ : ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం రోజున ఫర్టీ 9 ఫెర్టిలిటీ కొత్త అడుగు వేసింది. మగవారి వీర్యకణాలను ఏఐ టెక్నాలజీ ద్వారా పరీక్షించేందుకు లెన్స్‌హుక్ X12 ప్రో (lenshooke x12 pro) సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సికింద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అత్యుత్తమ ఐవిఎఫ్ సెంటర్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆరోగ్య సేవలో ఏఐ టెక్నాలజీని తీసుకురావడం ద్వారా సంస్థ మరింత సమర్థవంతంగా సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటి లయ అతిథిగా వచ్చారు. అలాగే ఫర్టీ 9 సేవల ద్వారా సంతాన సాఫల్యం పొందిన తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. తల్లిదండ్రులుగా మారిన తమ కల గురించి, సక్సెస్ స్టోరీలను పంచుకున్నారు.

సికింద్రాబాద్ కార్యక్రమంలో టు గెదర్ఇన్ ఐవిఎఫ్ క్యాంపెయిన్ పేరుతో కేక్ కటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం భారతదేశంలో ఫర్టిలిటీ రేట్ 1.9 కిందికి పడిపోయింది. వాస్తవానికి ఇది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1 కంటే తక్కువ కావడం ఆందోళనలో పెంచుతుంది. ఫర్టిలిటీ ఏపీలో 1.7 తెలంగాణలో 1.8 కిందికి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో మగవారిలో ఇంఫెర్టిలిటీ సమస్యల పరిష్కారం కీలకంగా మారింది. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ సమస్యలు ఎక్కువగా ఉండడం మిస్ క్యారేజ్ రేట్లు పెంచుతోందని ఫర్టీ 9 ఫెర్టిలిటీ సంస్థ *మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి* చెప్పారు. అయితే ప్రస్తుతం సంస్థ తీసుకొచ్చిన ఏఐ టెక్నాలజీ ద్వారా నిమిషాల వ్యవధిలో వేల సంఖ్యలో వీర్యకణాలను పరిశీలించి డీఎన్ఏ లోపాలను గుర్తించవచ్చని తెలుస్తోంది. ఇది సమస్యకు సరైన చికిత్స అందించేందుకు తోడ్పడుతుందని, అలాగే మగవారిలో వీర్యకణాల నాణ్యతను పెంచేందుకు తద్వారా సంతాన సమస్యలను పరిష్కరించవచ్చని డాక్టర్ జ్యోతి చెప్పారు.మగవారిలో సంతానానికి వీర్యకణాల నాణ్యత తక్కువగా ఉండటమే ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రస్తుతం ఉన్న వైద్య పరీక్షల ద్వారా వీర్యకణాల డిఎన్ఏ లో లోపాలను గుర్తించడం కొంత కష్టతరంగా మారింది. టెస్టింగ్ సమయంలో మైక్రోస్కోప్ కింద ఆరోగ్యవంతంగా కనిపించే వీర్యకణాల్లో కూడా లోపాలు ఉండే అవకాశం ఉంది. ఈ సమస్యలు సంతాన సాఫల్యానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న టెస్టింగ్ విధానాలు కొన్నిసార్లు టెస్టింగ్ సిబ్బంది చేసే తప్పుల వల్ల ఫలితాలను తారుమారు చేస్తున్నాయి.

ప్రస్తుతం ఉన్న టెస్టింగ్ విధానాల్లో జరుగుతున్న పొరపాట్లను సమర్థవంతంగా అరికట్టేందుకు ఫర్టీ 9 ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది కేవలం 6 నిమిషాల్లోనే ఒక్కో శాంపిల్ నుంచి 3 వేల వీర్యకణాలను పరీక్షించే సామర్థ్యం కలిగి ఉంది. వీర్యకణాల సంఖ్య మోటాలిటీ డిఎన్ఏ సమస్యలు వంటి వాటిని ఏకకాలంలో ఏఐ గుర్తిస్తుంది. దీని ద్వారా వైద్యులు ఆరోగ్యకరమైన వీర్యకణాలను ఐవిఎఫ్ చికిత్స కోసం ఉపయోగించడం సులభంగా మారుతుంది.

ప్రస్తుతం సంతాన సాఫల్య సమస్యలతో వస్తున్న వారిలో దాదాపు 50 శాతం కేసుల్లో మగవారిలోనే సమస్యలను గుర్తిస్తున్నారు వైద్యులు. అయితే 95% కేసుల్లో మహిళలే కన్సల్టేషన్ కోసం వస్తున్నారని *ఫర్టీ 9 ఫెర్టిలిటీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈవో వినేష్ గదియా* చెప్పారు. అందుకే తాము ఏఐ ఆధారిత సెమన్ అనలైజర్ తీసుకొచ్చి ఖచ్చితమైన డేటాను ఉపయోగించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి నూతన సాంకేతికత అనవసరమైన అడ్డంకులను తొలగిస్తూ దంపతుల్లో వైద్య విధానాలపై నమ్మకాన్ని పెంచుతుందని అన్నారు.

టుగెదర్ఇన్ఐవిఎఫ్ క్యాంపైన్ కింద సంస్థ దంపతులకు అసెస్మెంట్ ప్యాకేజ్ కేవలం 599 రూపాయలకే అందిస్తోంది. సంతాన సాఫల్యం స్పెషలిస్ట్ తో కన్సల్టేషన్, అల్ట్రా సౌండ్, ఏ ఎమ్ హెచ్ టెస్ట్, సెవెన్ అనాలసిస్ ఇందులో అందించబడతాయని ఫర్టీ 9 ప్రకటించింది. వెంటనే చికిత్స ప్రారంభించాలనుకుంటున్న దంపతులకు ఐయూఐ చికిత్స కోసం 50 శాతం తగ్గింపు, ఐవిఎఫ్ చికిత్సపై 25% తగ్గింపు జూలై 31 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. దీంతో ఫెర్టిలిటీ రంగంలో సరికొత్త అధ్యాయానికి ఫర్టీ 9 నాంది పలికింది. ఏఐ టెక్నాలజీ తో కచ్చితత్వం ద్వారా చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page