
లాలాగూడలోని కేంద్రీయ అసుపత్రిని తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ!
- Writer Desk
- Jul 17
- 1 min read
హైదరాబాద్: క్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈరోజు అనగా జూలై 16, 2025న సికింద్రాబాద్‌లోని లాలాగూడలోని కేంద్రీయ రైల్వే హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ నిర్మల రాజారాం; హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోకేష్ విష్ణోయ్ ; సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఐ. శివనాగ ప్రసాద్; సీనియర్ వైద్యులు మరియు ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఓల్డ్ ఔట్-పేషెంట్ బ్లాక్ (ఓ.పి.డి)లోనున్న ఆప్టోమాలజీ , డెంటల్, ఈ.ఎన్.టి, చెస్ట్ క్లినిక్ వంటి మొదలగు క్లినిక్‌లను తనిఖీ చేశారు. జనరల్ మేనేజర్ కొత్త ఓ.పి. డి బ్లాక్‌లో, రేడియాలజీ యూనిట్, డాక్టర్ల కన్సల్టేషన్ గదులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల వెయిటింగ్ లాంజ్‌లను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న చికిత్సకు సంబందించిన సౌకర్యాల గురించి ఆయన పెన్షనర్లు మరియు కుటుంబ సభ్యులతో సంభాషించారు మరియు ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి అదనంగా కావాల్సిన సౌకర్యాల గురించి అభిప్రాయాన్ని వారినుండి తీసుకున్నారు.
ఇంకా, జనరల్ మేనేజర్ అత్యవసర వార్డు (క్యాజువల్టీ), స్పెషల్ వార్డు, ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్ (ఐ.సి.సి.యూ), డయాలసిస్ యూనిట్ మరియు నూతనంగా ప్రారంభించబడిన కార్డియాక్ క్యాత్ ల్యాబ్ & రికవరీ రూమ్‌ను తనిఖీ చేశారు. జనరల్ మేనేజర్ శుభ్రత, పని వాతావరణాన్ని పరిశీలించారు మరియు కొంతమంది రోగులతో సంభాషించారు మరియు వారికి అందుతున్న సౌకర్యాలు మరియు చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

వీటితోపాటు పురుషుల మెడికల్ వార్డులు, ప్రసూతి వార్డు మరియు న్యూ బోర్న్ శిశువులకు సంబందించిన నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్.ఐ.సి.యూ) మొదలైన వాటిని కూడా తనిఖీ చేశారు.
Comments