top of page

సనాతన రాష్ట్రం కోసం రామరాజ్య సంకల్ప జపయజ్ఞం..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • May 19, 2025
  • 3 min read

‘సనాతన రాష్ట్రం’ కోసం ‘రామరాజ్య సంకల్ప జపయజ్ఞం’ చేయడం ద్వారా ఒక కోటి రామ నామ జపం సంపూర్ణం !

జపం యజ్ఞంలో దేశ విదేశాల నుండి వచ్చిన సాధకులు మరియు ధర్మప్రియ హిందువులు పాల్గొన్నారు --- నగరి, ఫోండా (గోవా)


భారతదేశంలో ‘రామరాజ్యం’ కేవలం ఒక ధార్మిక ఆదర్శం మాత్రమే కాదు, ఇది సంస్కృతి, నీతి మరియు న్యాయం ఆధారిత పాలన వ్యవస్థకు ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈ గొప్ప ఉద్దేశ్యం వైపు ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ ‘సనాతన రాష్ట్ర’ స్థాపన కోసం ‘రామరాజ్య సంకల్ప జపయజ్ఞం’ ద్వారా ఒక కోటి సార్లు ‘శ్రీరామ నామ’ జపమును ఫర్మాగుడి-ఫోండాలో సనాతన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘సనాతన రాష్ట్ర శంఖనాద మహోత్సవ’లో చేయడమైనది.


దేశ-విదేశాల నుండి వచ్చిన 25 వేలకు పైగా భక్తులు అత్యంత భావపూరిత వాతావరణంలో ‘శ్రీరామ జయ రామ జయ జయ రామ’ అని జపించారు. ఈ జపయజ్ఞంతో సంపూర్ణ వాతావరణం రామమయమైంది.



ఈ జపయజ్ఞం యొక్క ఉద్దేశ్యం రాష్ట్రానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం, నైతిక విలువలను పునఃస్థాపించడం మరియు సనాతన హిందూ సంస్కృతిని జాగృతం చేయడం.


1977 ఏప్రిల్ 15న హైదరాబాద్ నుండి దూల్పేట్ లో జన్మించి, 1991లో హిందూ వాహిని లో చేరి హిందూ ధర్మం కోసం నిస్వార్ధంగా పోరాడిన హైందవ వీరుడు, భయం లేకుండా గోహత్య, మతమార్పిడి వాటికి వ్యతిరేకంగా పోరాడి, దీనికి గాను జైలు శిక్ష కూడా అనుభవించి, హిందుత్వం మరియు జాతీయ రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న మన తెలంగాణ శాసనసభ్యులైన రాజా భాయ్ (శ్రీ రాజాసింగ్ ఠాకూర్) గారికి 'వీర శివ' అవార్డు మరియు 'హిందూ హృదయ సామ్రాట్' అవార్డులను ఇచ్చి సన్మానం చేయడం అయినది.

ఈ సందర్భంగా శ్రీ టి. రాజా సింగ్ గారు మాట్లాడుతూ, 'ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలి, మనం యుద్ధం చేయాలి. పహల్గామ్‌లో ఏమి జరిగిందో మీరు చూశారు, మతం అడిగి-అడిగి బుల్లెట్‌తో కాల్చారు. రాబోయే కాలంలో హిందూ రాష్ట్రం వస్తుందని గురఃజీ చెబుతున్నారు. కానీ అంతకు ముందు చాలా పెద్ద ధర్మయుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మనం పోరాడాలి, అప్పుడే మనం బతకగలం. మనం ఒకే సంకల్పంతో ముందుకు వెళ్ళాలి, అది భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం అని అన్నారు.


హిందూ జన జాగృతి సమితి జాతీయ ప్రవక్త శ్రీ రమేష్ షిండే మాట్లాడుతూ,

ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమమైనా, యుద్ధమైనా సరే శంఖనాథంతోనే ప్రారంభమవుతుంది. త్రేతా యుగంలో శంఖనాథం పూరించిన తర్వాత లంకా దహనం అయింది, కురుక్షేత్రంలో శంఖనాదం పూరించిన తర్వాత మహాభారత యుద్ధం అయింది. కాశ్మీర్ మరియు కేరళలో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, కర్ణాటకలో హిందుత్వవాదులను చంపుతున్నారు. బంగ్లాదేశ్లో రెండు పార్టీల మధ్య గొడవ అయితే ఎవరి మీద దాడి చేశారు? పెహల్గాంలో ఎవరెవరు హిందువు అని వేరుచేసి హిందువులను చంపినప్పుడు ఈ సెక్యులర్ వాదులు ఏమీ మాట్లాడరు, తమ సెక్యులర్ వాదమును చూపించరు, అక్కడ ఉన్నవాళ్లు మరియు చిన్నపిల్లలు చంపబడింది హిందువులని చెప్పినప్పటికీ కూడా, హిందువులు కాదని ఈ సెక్యులర్ వాదులు వాదిస్తారు. నాగపూర్ లో హింస చెలరేగినప్పుడు ఎవరి ఇల్లు కూల్చారు, ఎవరి వాహనాలు దగ్ధం చేశారు? లవ్ జిహాద్ గాని, హలాల్ విషయంలో కానీ ఇంకా కాశ్మీర్ ఉగ్రవాదం గానీ ఇలా ఏ విషయంలో అయినా సరే హిందువులే టార్గెట్ చేయబడుతున్నారు. మెజారిటీ సంఖ్యలో ఉన్న హిందువులు మీద ఈ విధంగా హత్యలు, దాడులు జరుగుతున్నప్పటికీ ఇంకా జాగృతి గురించి ఆలోచించవలసి వస్తుంది. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. ఈ స్థితిని ప్రస్తుతం మార్చవలసిన అవసరం మనందరికీ ఉంది.

సమర్థ రామదాసు ఏ విధంగా అయితే హిందువులను ప్రేరేపించి చత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో చేర్పించారో, అదేవిధంగా ప్రస్తుతం సాధుసంతులు హిందువులను ప్రేరణ చేస్తూ సనాతన రాష్ట్ర నిర్మాణానికి కృషి చేస్తున్నారు.

ఇప్పుడు పరుశురాముని భూమి అయిన గోవాలో సనాతన రాష్ట్ర స్థాపనకు శంఖనాదం పూరించడమైనది.

గజవ-ఏ-హింద్ వాళ్లు మరియు కొంతమంది జీహది ఉగ్రవాద సంస్థలు 2047లో భారతదేశమును 'ఇస్లామిక్ స్టేట్' గా మారుస్తామని అంటున్నారు. అనేకమంది సెక్యులర్ వాదులు భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచంలో యూదుల మీద గాని, పార్సీల మీద గాని దాడులు జరిగినప్పుడు వారు ఆశ్రయం కోసం భారతదేశమునకు వచ్చారు. సనాతన రాష్ట్రం ఒకటే విశ్వ కళ్యాణం కావాలని ఆశిస్తూంది. అందుకే మనము ధర్మ శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. టీవీ చానల్స్ ద్వారా, బాలీవుడ్ ద్వారా మన మీద జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆపవలసి ఉంది. అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి. లంచగొండితనం,అవినీతి వీటికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడవలసి ఉంది. దీనికిగాను హిందూ జన జాగృతి సమితి ,'సుయశ్ అభియాన్' అనే కార్యక్రమం నిర్వహించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన మావోలకు ఏ విధంగా రిసెప్షన్ ఇచ్చి తయారు చేశారో, అదేవిధంగా మనము కూడా ప్రశిక్షణ తీసుకొని భవిష్యత్తులో మన ఆత్మ రక్షణ కోసం తయారు కావలసిన అవసరం ఉంది. మన భావితరాలు సురక్షంగా ఉండాలంటే డ్యాన్సులు చేయడం మరియు సినిమా పాటలు పాడడం కాకుండా స్వయంగా సంరక్షణ ప్రశిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవసేన, కౌరవ సేన కన్నా తక్కువ ఉన్నప్పటికీ శ్రీకృష్ణుని ఆశీర్వాదంతో ధర్మస్థాపన అయింది. 'యథ ధర్మః తథః విజయః' ప్రకారం ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం తప్పక లభిస్తుంది. అదే విధంగా మనం కూడా సనాతన రాష్ట్ర స్థాపనను చేయడానికి తప్పక కృషి చేయాల్సి ఉందని చెప్పారు.

••••••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page