top of page
పార్టీ పెట్టట్లేదు..! చేరుతున్నారంతే..!!

పార్టీ పెట్టట్లేదు..! చేరుతున్నారంతే..!!

Writer: Writer Desk
Writer Desk
Sep 13, 2025
2 min read

హైదరాబాద్ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీకి సంబంధించి బీసీ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు పాలూరు రామకృష్ణయ్య స్పష్టత ఇచ్చారు. తమ పార్టీలోనే తీన్మార్ చేస్తున్నాడని, ఆయనను జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమించనున్నట్లు (నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ) రామకృష్ణయ్య తెలిపారు..

పార్టీని తీన్మార్ కు అప్పగించినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని న్యూ - సెన్స్ కు ఇచ్చిన వివరణలో స్పష్టం చేసారు. అయితే పార్టీని తనకు అప్పగించాలని తీన్మార్ ప్రతిపాదన చేసిన విషయం వాస్తవమే అని ఆయన చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తనను అనేక రకాల ఇబ్బందులకు గురిచేశారని, బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ బలంగా ఉందని భావించిన కేసీఆర్ కేటీఆర్ లు కుట్రపూరితంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారని, ఆర్థికంగా నష్టపరిచేందుకు స్థిరస్తులను విక్రయించకుండా చేశారని రామకృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయతించామని, అయితే ఆర్థికపరమైన అండ లేకపోవడంతో అనుకున్న స్థాయిలో విస్తరించలేకపోయామని చెప్పారు.


రెండు దశాబ్దాల క్రితం 2004 లో తమ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించి నిబంధనల.ప్రకారం జాతీయ స్థాయి రాజకీయ పార్టీగా నడిపిస్తున్నామని, దాదాపు అన్ని రాష్ట్రాల్లో కమిటీలు వేస్తూ నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నామని చెప్పారు. బీసీల అభ్యున్నతి, రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పాటు చేసిన తమ బీసీ యునైటెడ్ ఫ్రంట్ అదే లక్ష్యంతో నేటికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని రామకృష్ణయ్య చెప్పారు.


కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించకుండా ఉంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బలమైన.రాజకీయ శక్తిగా తమ పార్టీ ఎదిగేదని చెప్పారు. ప్రస్తుతం పార్టీకి ఆర్థిక అండదండలతో పాటు ముందుండి నడిపించేవాడు కావాలనే ఆలోచనతో ఉన్న సమయంలో తీన్మార్ ముందుకు వచ్చాడని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నామని రామకృష్ణయ్య అన్నారు.

ఎన్నికల కమిషన్ కు రామకృష్ణయ్య రాసిన లేఖ..!
ఎన్నికల కమిషన్ కు రామకృష్ణయ్య రాసిన లేఖ..!

తీన్మార్ ప్రతిపాదన నిజమే..!

పార్టీని పూర్తిగా తనకు అప్పగించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తమ వద్ద ప్రతిపాదించిన విషయం వాస్తవమే అని రామకృష్ణయ్య తెలిపారు. అయితే ఆ ప్రతిపాదనకు తాము అంగీకరించలేదని దీంతో అది అక్కడితో ఆగిపోయిందని.. ఈ మధ్య మరోసారి తీన్మార్ మరోసారి వచ్చి కలిశారని, పార్టీలో ప్రాధాన్యత గల పదవి ఇవ్వాలని కోరారని, జాతీయ కార్యనిర్వహక అధ్యక్ష పదవి ఇచ్చేందుకు తాను అంగీకరించానని రామకృష్ణయ్య తెలిపారు. సూర్యారావు సహా పలువురు చిరకాలంగా సన్నిహితంగా ఉండే నాయకులు కూడా తీన్మార్ తో పాటు వచ్చారని, వాళ్ళ సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని రామకృష్ణయ్య స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని తెలుపుతూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు కూడా లేఖ రాశానని ఆయన తెలిపారు.


పార్టీని పూర్తిగా తీన్మార్ కు అప్పగించే యోచన ఏది ప్రస్తుతానికైతే ఏదీ లేదని ఆయన చెప్పారు..!


.....

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.

© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page