రిహార్సల్ పై ఫేక్ ప్రచారం!

పోలీస్ రిహార్సల్ సర్వ సాధారణం..!
ముఖ్యమంత్రి ఎక్కడ పర్యటించిన అలాగే చేయాలి
అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ అన్ని విభాగాలను సమన్వయం చేస్తుంది..!
ఎవరి పెత్తనాలు అజమాయిషీ ఉండదు!
అవగాహన లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
స్పష్టత ఇచ్చిన పోలీస్ ఉన్నతాధికారులు!
గులాబీ సోషల్ మీడియా దుష్ప్రచారం!
పదేళ్లు కేసీఆర్ సీఎం ఉన్నపుడు ఇలాగే చేశారు
గులాబీ సోషల్ మీడియాకు కేటీఆర్ కనీస పరిజ్ఞానం కల్పించాలి
మండిపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే!

ఎందుకీ రాద్దాంతం..!!?
సిరిసిల్లలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రతి అంశాన్ని బూతద్దంలో చూపిస్తూ ప్రచారాలు చేస్తున్నారా..!?
పర్యటన.. హెలిప్యాడ్.. పాదయాత్ర సహా దేన్నీ వదలకుండా విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. చివరికి పోలీసు బందోబస్తు పై కూడా చిల్లర కామెంట్స్ చేస్తున్నారని.. ముఖ్యంగా గులాబీ పార్టీ నాయకత్వం సీఎం టూర్ పై బెంబేలెత్తిపోతోందని.. వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారమే ఇందుకు నిదర్శనమని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శించారు..! పదేళ్లు ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ ఎక్కడ పర్యటించినా ఇలాగే పోలీసు భద్రత బందోబస్తు రిహార్సల్స్ చేసేవారని.. అది తెలియకుండా అవగాహన లేకుండా.. వీడియోలు తీసి పిచ్చి ప్రచారాలు చేస్తున్నారని.. అసలు సీఎం పర్యటనలపై ముందస్తు రిహార్సల్స్ ఉంటాయనే విషయం పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ నేతలకు తెలియక పోవడం విడ్డూరంగా ఉందని.. కేటీఆర్ ముందు తన సోషల్ మీడియా టీమ్ కు కనీస ఙ్ఞానం ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిదని.. సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నాయకుడు న్యూ - సెన్స్ తో మాట్లాడుతూ విమర్శలు చేశారు..!
తప్పుడు ప్రచారాలను కొట్టి పారేసిన అధికారులు..!
ముఖ్యమంత్రి పర్యటనకు ముందు రోజు భద్రత బందోబస్తుకు సంబంధించి రిహార్సల్స్ చేయడం సాధారణ విషయమని.. సిరిసిల్లలో కూడా అలాగే చేశామని సీఎం భద్రతా విభాగం అధికారులు చెప్పారు..!

అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజనింగ్ ( ఏఎస్ఎల్ ) అన్ని విభాగాలతో సమన్వయం చేస్తూ భద్రతా బందోబస్తు పర్యవేక్షిస్తుంది అని.. ఇక్కడ ఎవరి పెత్తనం.. అజమాయిషీ ఉండదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు..!*
అయితే సిరిసిల్లలో చేసిన రిహార్సల్స్ ను వీడియోలు తీసి దుష్ప్రచారం చేస్తున్నారని.. స్వయంగా ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తారు కాబట్టి అక్కడున్న పాదయాత్ర మార్గం పరిస్థితులను.. రూట్ మ్యాప్ ను బట్టి రిహార్సల్ నిర్వహించామని.. అందులో కొత్తేమీ లేదు అన్నారు...
భద్రతా విభాగం ఉన్నతాధికారులు న్యూ - సెన్స్ తో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన అంశాలను బట్టి.. రూట్ మ్యాప్ ను బట్టి భద్రతకు సంబంధించి ముందస్తుగా రిహార్సల్స్ చేయడం బందోబస్తులో బాగం అని.. సీఎం పాదయాత్ర మార్గంలో రిహార్సల్ చేశారని.. ఫేక్ ప్రచారాలు నమ్మవద్దని సూచించారు.!
••••••




Comments