top of page

మరొకటి తగ్గింది పుష్పా..! అదృష్టం అంటే ఇదే..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 2 days ago
  • 3 min read

తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి..!


తీవ్ర ఉత్కంఠ మధ్య అడ్డంకులు అధిగమించి ఎట్టకేలకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన జోసెఫ్ విజయ్ చరిత్ర సృష్టించారు..! రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే ఎంజీఆర్ మాదిరిగా నేరుగా ముఖ్యమంత్రి స్థానాన్ని అందుకున్నారు. !


అయితే ఎన్నికల ఫలితాల నటి నుండి మొదలైన రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తీసుకుంది..! వారం రోజులపాటు ఉత్కంఠ పూరిత వాతావరణం కనిపించింది..!


ఫలితాలలో విజయ్ పార్టీ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడంలో విఫలమైంది! పదకొండు సీట్ల దూరంలో ఆగిపోయింది!


పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక గవర్నర్ ను కలిసిన విజయ్ తనకు అవకాశమివ్వాలని కోరినప్పటికీ గవర్నర్ సమ్మతించలేదు! మెజారిటీ సీట్లు లేవని తిరస్కరించారు! దీంతో రాజకీయ సంక్షోభం మొదలైంది.!


మొన్నటివరకు గత అధికార పార్టీ డీఎంకే కూటమిలో భాగస్వాములుగా ఉన్న లెఫ్ట్ పార్టీలు, ఐయూఎంఎల్ పార్టీ, వీసీకే పార్టీ ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయి.. లెఫ్ట్ పార్టీలు నాలుగు సీట్లు గెలుచుకోగా మిగతా రెండు పార్టీలు రెండు చొప్పున సీట్లు గెలిచాయి.. కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లు గెలుచుకుంది! కాంగ్రెస్ కూడా అప్పటివరకు డీఎంకే తో స్థానికంగా ఉన్న సంబంధాలను తెంచుకుని విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది! అయినప్పటికీ విజయ్ కి మద్దతు సరిపోలేదు! మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లకు మరో ఆరు సీట్లు అవసరం అయ్యాయి! మిగిలిన చిన్న పార్టీలు విజయ్ కు మద్దతు ఇవ్వడానికి మొదట నిరాకరించాయి.! దీంతో అనిశ్చితి నెలకొంది.!



భారీగా సీట్లు సాధించిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కూడా అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నాలు చేశాయి.! అయితే మ్యాజిక్ ఫిగర్ విషయంలో ఆ పార్టీలకు కూడా సమస్య ఏర్పడింది.! విజయ్ విఫలమైతే మళ్ళీ ఎన్నికలు వచ్చే ప్రమాదముందని గ్రహించిన రెండు పార్టీల నేతలు విజయ్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీరించాలని డిమాండ్ చేశాయి.!


మరోవైపు బీజేపీ ఏదో గేమ్ ఆడుతోందని భావించిన లెఫ్ట్ పార్టీలు మనసు మార్చుకున్నాయి.. విజయ్ కు బేషరతుగా బయటనుండి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి..! వీసీకే పార్టీ మాత్రం అంతర్గతంగా పలు డిమాండ్లను ముందుపెట్టి.. చివరికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతుతో 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకున్న విజయ్ గవర్నర్ వద్దకు వెళ్లడానికి సమాయత్తం అవుతున్న పరిస్థితుల్లోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది..! చివరి నిమిషం వరకు మద్దతుకు ససేమిరా అన్న ఐయూఎంఎల్ కూడా బెట్టు వీడి విజయకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది..!


దీంతో మ్యాజిక్ ఫిగర్ ను దాటి రెండు సీట్లు అదనంగా విజయ్ టీవీకే కూటమి సీట్ల సంఖ్య సాధించింది..!


దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆదివారం లాంఛనంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయాయి..!


అనుకోని షాక్.. ఆదుకున్న లాస్ట్ మినిట్ సపోర్ట్..!

విజయ్ కు ఒకవైపు షాక్ మీద షాక్ తగిలినా.. మరోవైపు అదృష్టం ఆదుకుంటూ వస్తుందని గత వారం రోజుల పరిణామాలు నిరూపిస్తున్నాయి..!


అందరి అంచనాలు.. ఎగ్జిట్ పాల్ అంచనాలు తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని విజయం సాధించింది విజయ్ పార్టీ..! దీంతో అవధుల్లేని ఆనందానికి గురయ్యారు విజయ్ సహా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు.. అయితే ఆ తర్వాత నుండి విజయ్ పార్టీకి షాక్ లు మొదలయ్యాయి..! మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోవడం.. గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు నిరాకరించడం..! మ్యాజిక్ ఫిగర్ చూపించాలంటూ షరతులు విధించడం.. చిన్నా చితకా పార్టీల మద్దతు నిరాకరణ..! మరోవైపు తమ పార్టీకి ధీటుగా సీట్లు కలిగి ఉన్న ప్రధాన పార్టీల కదలికలు..చిన్న పార్టీలతో చర్చలు విఫలం.. ఇలా ఒకటొకటిగా ఐదు రోజులపాటు కొనసాగిన పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి..! అయితే విజయ్ కు ప్రతిసారి అదృష్టం కలిసివస్తోందని పరిణామాలు నిరూపించాయి..! చివరికి నిమిషంలో కూడా విజయ్ కు అనుకోని అదృష్టం కలిసివచ్చింది..! విసికే మద్దతు ఖరారయ్యాక మ్యాజిక్ ఫిగర్ సంఖ్య సరిపోవడంతో వారు ఇచ్చిన మద్దతు లేఖలతో గవర్నర్ వద్దకు వెళ్లడానికి విజయ్ సిద్ధమవుతున్న తరుణంలో అనూహ్యంగా రెండు సీట్లు కలిగి ఉన్న ఐయుఎంఎల్ కూడా మద్దతు ప్రకటించి గవర్నర్ కు ఇచ్చే లేఖను కూడా టీవీకే నేతలకు అందచేసింది..! అదనంగా మరో రెండు సీట్లు కూడా కలిసి రావడంతో విజయ్ సంతోషంగా గవర్నర్ కార్యాలయానికి వెళ్లి వాటిని సమర్పించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు..! ఏ రెండు సీట్లు కలిగి ఉన్న పార్టీ చివరి నిమిషంలో విజయ్ కు సర్ప్రైజ్ ఇచ్చిందో.. ఇపుడు అవే రెండు సీట్లు విజయ్ ప్రభుత్వానికి ఒక పెద్ద అండగా.. విజయ్ ప్రభుత్వాన్ని ఆపదలో ఆదుకున్న మిత్రుడిగా మారిపోయాయి!


ఎందుకంటే విజయ్ పార్టీ మొత్తం 108 సీట్లు గెలిచినప్పటికీ.. విజయ్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా గెలిచి ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది..దీంతో 107 సీట్లకు తగ్గిపోయింది.. తాజాగా మరో సీటు కూడా అనూహ్యంగా తగ్గిపోయింది.! ఒక్క ఓటుతో ఓడిపోయిన డీఎంకే అభ్యర్థి మాజీ మంత్రి మద్రాస్ హై కోర్టు ను ఆశ్రయించారు.! పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాట్లు జరిగాయని.m మళ్ళీ ఓట్లు లెక్కించాలని ఆయన హై కోర్టును ఆశ్రయించడంతో ఇపుడు ఆ స్థానంలో గెలిచిన టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతిని బాలనిరూపణ ఓటింగ్ కు దూరంగా ఉండాలని ఆదేశించిన కోర్టు విచారణ పూర్తయ్యేవరకు ఆ స్థానాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది! మొత్తం మీద విజయ్ పార్టీ కి ఇదొక అనుకోని షాక్ అని భావించవచ్చు..!


రేపు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలనిరూపణ ప్రక్రియ నిర్వహించనున్నారు..! హై కోర్టు ఆదేశాల వల్ల ఒక ఎమ్మెల్యే ఓటింగ్ కు దూరంగా ఉండాలి.. అంటే ప్రస్తుతం విజయ్ కలిగి ఉన్న 120 ఎమ్మెల్యేల్లో 119 మాత్రమే ఓటింగ్ లో పాల్గొంటారు.! నిజంగా చివరి నిమిషంలో ఐయూఎంఎల్ మద్దతు ఇవ్వకపోతే ఇపుడు విజయ్ నిజంగానే మ్యాజిక్ ఫిగర్ సీట్లు నిరూపించుకోవడం కష్టమే అయ్యేది..!


ఏది ఏమైనా విజయ్ రాజకీయ అధికారం మొదట్లోనే..ఒక వైపు అనుకోని కష్టాలు.. అంతకు మించిన అదృష్టం కలిసి వస్తున్నాయి..!


••••••••••

A Report By

ShyamaSundar Akula

••••••••••


Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page