top of page

డెబ్భై ఆరేళ్ల కుర్రాడు.. శరీరాన్ని స్ప్రింగ్ లా వంచేస్తున్నాడు..!!

Writer: Writer Desk
Writer Desk
Jun 21
2 min read

క్రమశిక్షణ గల జీవన శైలి..!

శారీరక వ్యాయామం..!

ఆహారపు అలవాట్లపై కచ్చితమైన నియంత్రణ..!

మానసిక ఒత్తిడిని అధిగమించే ధ్యాన సూత్రాల ఆచరణ..!


ఐదు దశాబ్దాలుగా రాజకీయ వృత్తిలో నిత్యం పద్దెనిమిది గంటలు.. అంతకు మించి కూడా శ్రమించగల తత్వాన్ని అలవరుచుకున్నారు..!


ఎన్నికల సమయాల్లో ఒకటీ రెండు గంటలు మాత్రమే నిద్రించిన దాఖలాలు ఎన్నో..!


ఉదయం కార్యరంగంలోకి ఎంత ఉత్సాహంగా చలాకీగా దిగుతారో.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు కూడా అంతే చురుకుదనం ఉత్సాహంగా కనిపిస్తారు..!


అలసటను అధిగమిస్తూ మెళుకువలను అనుసరిస్తూ శారీరక మానసిక స్థితిని స్థిరంగా కొనసాగేలా చూసుకుంటారు..!


ఇపుడు ఆయన వయసు డెబ్భై ఐదు దాటింది.. మొన్న ఏప్రిల్ 20న డెబ్భై ఆరులోకి అడుగుపెట్టారు..!


తాజాగా యోగా దినోత్సవం సందర్భంగా గత రెండురోజులుగా ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాతో కలిసి చేస్తున్న యోగాసనాలు అందరినీ అబ్బుర పరుస్తున్నాయి..!


చంద్రబాబు తన శరీరాన్ని ఆసనాలకి అనుగుణంగా సునాయసంగా మలుస్తూ.. శారీరక దృఢత్వాన్ని స్థిరస్తాని ప్రదర్శిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..!



నలభై.. నలభై ఐదేళ్ల వయసులోనే మోకాళ్ళ చిప్పలు అరిగిపోవటం.. కీళ్లు.. నడుము నొప్పులతో నడవలేక పోవడం.. కింద కూర్చోలేకపోవడం వంటివి చూస్తున్న దశలో.. డెబ్భై ఐదేళ్ల వయస్సు దాటిన వ్యక్తి ఇలా స్ప్రింగ్ లా తన శరీరాన్ని సునాయసంగా తిప్పుకోగలుగుతూ యోగాసనాలు వేస్తుంటే.. ఆయన తనయుడు లోకేష్ సహా.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. టీడీపీ నేతలు..కార్యక్రమానికి హాజరైన అందరూ అలా కన్నార్పకుండా చూస్తుండిపోయారు..!


యోగా వ్యాయామం క్రీడల.వృత్తిలో ఉండేవాళ్ళు వయసు పైబడిన తర్వాత ఇలా చేయడం సాధారణ విషయమే కావొచ్చు..!


కానీ ఇక్కడ అలా కాదు.. ఆయన వృత్తి రాజకీయం.. ఒక రాజకీయ పార్టీని నడిపిస్తూ నిత్యం ఊపిరి సలపలేని పని ఒత్తిడి.. అంతకు మించిన మానసిక ఒత్తిడితో నిత్య జీవితం సాగించే పరిస్థితిలో ఉన్న వ్యక్తి..!


అలాంటి క్లిష్టమైన బాధ్యతల్లో ఉండే వ్యక్తులు మానసికంగా తీవ్ర ఒత్తిడి గురవుతూ ఆ ప్రభావం వల్ల శారీరకంగా అలసిపోతూ ఉంటారు..! కానీ చంద్రబాబు అన్నిటినీ యోగా మంత్రంతో.. అకుంఠిత క్రమశిక్షణతో అధిగమిస్తున్నారు..! చురుకుదనం విషయంలో మనవడి వయసు ఉండే యువకులతో పోటీ పడుతున్నారు..!


కింద కాళ్ళు మడిచి కూర్చోవడమే కాదు.. ఎలాంటి ఆసరా లేకుండా అలాగే నిలబడగల శక్తిని కలిగి ఉండటం విశేషమే..!


ఎంత తినాలో లెక్క వేసుకుని అంతే తింటారు..! నచ్చిన ఆహారం ఉంది కదా అని ఒక్క స్పూన్ కూడా అధికంగా తీసుకోరు..!


కచ్చితమైన ఆహారపు అలవాట్లు కూడా ఆయన శారీరక పటుత్వానికి ప్రధాన కారణం..!


కొత్త తరం వాళ్ళకి చంద్రబాబు ఈ విషయంలో ఎంతో స్ఫూర్తిగా ఆదర్శంగా నిలుస్తున్నారు..!



విజయవాడలో యోగాంధ్ర..!

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు..!

ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకున్న పౌరులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొని.. రాందేవ్ బాబా ను అనుసరిస్తూ యోగాసనాలు వేశారు..!


•••••••••

A Report By

ShyamaSundar Akula

9010746999

•••••••••


Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page