top of page

ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం..!

Writer: Writer Desk
Writer Desk
Sep 4, 2025
1 min read

సంపూర్ణ చంద్ర గ్రహణం


గ్రహణ నిర్ణయములు


మొదటి చంద్ర గ్రహణము 07-09-2025 ఆదివారం రాత్రి 07-09-2025 భాద్రపద పూర్ణిమా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిషం మరియు పూర్వాభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును కావున కుంభరాశివారు దీనిని వీక్షించగూడదు. మరుసటి రోజు యధావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను.


చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించే ఈ సందర్భంలో, చంద్రుడి రూపం ఎరుపు-నారింజ రంగులో మెరిసిపోతూ “రక్త చంద్రుడి”గా ఆకాశాన్ని అలరిస్తాడు. మొత్తం 82 నిమిషాలపాటు సంపూర్ణ దశ కొనసాగనుండటంతో ఇది ఈ దశాబ్దంలో అత్యంత వైభవమైన చంద్రగ్రహణంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

భారతదేశం సహా ఆసియా ఖండం, ఆస్ట్రేలియా పశ్చిమ భాగం, యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. భారత్‌లో అయితే ఉత్తరం నుంచి దక్షిణం వరకూ, తూర్పు నుంచి పడమర దాకా దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు దీన్ని వీక్షించే అవకాశం ఉంది. ఢిల్లీ, లక్నో, జైపూర్, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి మెట్రోపాలిటన్ నగరాలతో పాటు, చిన్న పట్టణాల్లోనూ ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది.


గ్రహణ నిర్ణయములు




గ్రహణ స్పర్శకాలం - రాత్రి గం.9-50


ఉన్మీలన కాలం - రాత్రి గం. 10-58


గ్రహణ మధ్యకాలం - రాత్రి గం. 11-41


నిమీలన కాలం - రాత్రి గం. 12-24


గ్రహణ మోక్షకాలం - రాత్రి గం. 1-31


ఆద్యంత పుణ్యకాలం - ఉ గం. 3-41


.......

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page