top of page

బయట అందం.. లోపల దుర్గంధం..!

Writer: Writer Desk
Writer Desk
Mar 2
1 min read

అవును..బయటకి ఎంత అందంగా కనిపిస్తాయో.. లోపల అదే స్థాయి దుర్గంధపూరితంగా కిచెన్ ఉంటుంది..!


హైదరాబాద్ హోటళ్లు రెస్టారెంట్ ల తీరు ఇది..


స్టార్ హోటల్ మామూలు టిఫిన్ సెంటర్ అనే తేడా ఏంలేదు..


హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకునే పాపులర్ హోటళ్లలో కూడా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు బయటపడుతున్న వైనం తెలిసిందే..! కిచెన్ లో ఎక్కడా నీట్ గా ఉండదు.. వంటచేసేవాళ్ళు కూడా నీట్ గా ఉండరు..! నాసిరకం ఆహార పదార్థాలు ధాన్యాలు..! దుర్గండపూరిత వాతావరణం.. దుర్వాసనలు వెదజల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది..!



తాజాగా అత్తాపూర్ లోని రెండు హోటళ్లను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు దుర్గంధపూరితంగా ఉన్న కిచెన్ లను చూసి అవాక్కయ్యారు..


ఎక్కడికక్కడ దుమ్మూ కొట్టుకుపోయి నూనె ఆవిరి గోడలకు అంటుకుని పేరుకుపోయి.. అత్యంత దుర్గంధపూరితంగా కిచెన్ లో వాతావరణం కనిపించింది..



అత్తాపూర్ లోని స్టార్ ప్రైడ్( స్టార్ ప్యారడైజ్) హోటల్, గోల్డెన్ ప్యాలెస్ రెస్టారెంట్ లను ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. రెండు హోటళ్లు ఏ మాత్రం శుభ్రత లేకుండా.. దుర్గదపూరితంగా ఉన్న కిచెన్ లలో వంటలు.చేస్తున్నారని గుర్తించి నోటీసులు జారీ చేశారు..


ఒక హోటల్ లో కుళ్ళిపోయిన మాంసం.. ఇంకో హోటల్లో చాలాకాలంగా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చికెన్ ను గుర్తించారు.. వాటి శాంపిల్ సేకరించి పరీక్ష కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు..!



కస్టమర్ల నుండి భారీగా గుంజడానికి బయట హంగూ ఆర్భాటాలతో కనిపించేలా చేసే హోటళ్లు రెస్టారెంట్ల నిర్వాహకులు.. ఆహారం విషయంలో మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి హోటళ్లను పూర్తిగా సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..!


రెండు హోటళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని.. వాటికి నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్య తెలిపారు..


.......

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page