top of page

అన్నయ్యా.. అప్పుడు అలా కేక్ కట్ చేసారు..!

Writer: Writer Desk
Writer Desk
Aug 22, 2025
1 min read

హ్యాపీ బర్త్ డే అన్నయ్యా..!

చిరంజీవికి పవన్ శుభాకాంక్షలు..!

తన చిన్నతనంలో అన్నయ్య జరుపుకున్న ఫోటోలు పంపించిన పవన్!

హైదరాబాద్ : అన్నయ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి వయసులో జరుపుకున్న పుట్టినరోజు ఫోటోలను పంపించి అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్..!



తమ్ముడి పంపిన ఫోటోలను చూసి మురిసిపోయిన చిరంజీవి తమ్ముడిని ఆప్యాయంగా ఆశీర్వదిస్తూ సంతోషం వ్యక్తం చేశారు..

••••

చిరంజీవి మెసేజ్ యథాదతంగా...


జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు!


త‌మ్ముడు క‌ల్యాణ్‌...


ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్ర‌తీ మాట‌.. ప్ర‌తీ అక్ష‌రం నా హృద‌యాన్ని తాకింది. అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్య‌దీక్ష‌త‌, ప‌ట్టుద‌ల చూసి ప్ర‌తీ క్ష‌ణం గ‌ర్వ‌ప‌డుతూనే ఉన్నా. నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుంది.


ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వ‌చ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్ర‌తీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను.


ఇట్లు


నీ అన్న‌య్య‌


....

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page