బీ గ్రేడ్ సీన్లతో డిగ్రేడ్ చేశాడు..! పెద్ది బుచ్చిబాబుపై ఆగ్రహం..!
- Writer Desk

- 1 minute ago
- 2 min read
జాన్వీ గ్లామర్ ను పెద్ది దర్శకుడు దుర్వినియోగం చేశాడు..!
ఆమెను సెక్స్పోజింగ్ గర్ల్ గా చూపించే ప్రయత్నంచేశాడు..!
ఆడదంటే ఆటబొమ్మ..! హీరో కోసం ఒంపుసొంపులు ప్రదర్శించే ఐటమ్ గర్ల్..!
హీరో అంటే తనకు నచ్చిన అమ్మాయిపై అఘాయిత్యం చేసేలా ప్రపోజ్ చేయాలా..!?
ప్రేమిస్తావా చేస్తావా అంటూ బెదిరింపుల ఉన్మాద ప్రేమ చూపిస్తే హీరో అంటారా..!?
అసలు ఆడదంటే దర్శకుడు బుచ్చిబాబు ఏమనుకుంటున్నాడు..!?
ఒక పెద్ద హీరో.. మరో వైపు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సాధించుకున్న అలనాటి ప్రముఖ నటి కుమార్తె..!
ఇలాగేనా దర్శకుడు చూపించే విధానం..!
క్రీడలతో సందేశాన్ని ఇచ్చే సినిమా తీశానంటూ గొప్పగా ప్రకటించిన బుచ్చిబాబు.. చీప్..చిల్లర సీన్లతో సినిమాలో హారోయిన్ వ్యక్తిత్వాన్ని అభాసుపాలు చేసి.. నటిగా జాన్వీకి బ్యాడ్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నించేశాడని విరుచుకుపడుతున్న మహిళా లోకం..!
ఆమెను ఒక బీ గ్రేడ్ రేంజ్ కి దిగజార్చే ప్రయత్నం జరిగిందనే విమర్శల దాడి..!
పెద్ది విడుదల తర్వాత సినిమా చూసిన మహిళలు ట్విట్టర్ ఫేస్బుక్ వేదికగా బుచ్చిబాబుపై విరుచుకుపడుతున్నారు..!
మూవీ రివ్యూలు చేసిన వారు సైతం జాన్వీ విషయంలో బుచ్చిబాబు చేసిన తప్పులను గట్టిగానే పాయింట్ ఔట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు..!
ఒక అమ్మాయి మనోభావాలతో సంబంధం లేకుండా..హీరో పూర్తి ఆధిపత్యంతో ఆమెను లొంగదీసుకునే సన్నివేశం.. అసందర్భంగా ముద్దులు పెట్టే దృశ్యాలు ఎబ్బెట్టుగా.. మహిళలను కించపరిచేదిగా ఉందని.. ఆమె వేషధారణ..కాస్ట్యూమ్స్.. హాహబావాలు మొత్తం అత్యంత చిల్లరగా చూపించే ప్రయత్నం జరిగిందని.. కేవలం జాన్వీ ని ఎంత వీలైతే అంత అసభ్యంగా చూపించి జనాలను థియేటర్లకు రప్పించే చీప్ ప్లాన్ తో బుచ్చిబాబు ఇలా చేసి ఉంటాడని మహిళలు ఏకిపారేస్తున్నారు..!

క్షమాపణలు చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు..!
‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ పాత్ర రూపకల్పన.. కాస్ట్యూమ్స్.. అందాల ఆరబోత.. ముద్దు సన్నివేశాల సీన్లపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో బుచ్చిబాబు పునరాలోచనలో పడ్డాడు.. సందేశాత్మక సినిమా అంటూ..ఇదేం దరిద్రం అంటూ ఊహించని రీతిలో విమర్శల దాడి ఎదురుకోవాల్సి రావడంతో ఆందోళనకు గురైన బుచ్చిబాబు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాడు..!
సినిమాలో హీరోయిన్ కి సంబంధించి అభ్యంతరకర సీన్లను తొలగిస్తామని ట్విట్టర్ వేదికగా బుచ్చిబాబు ప్రకటించాడు..! తనను క్షమించాలని కోరాడు..,!
ఇంకా ఏమన్నాడంటే...
సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికే గానీ.. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, గౌరవానికి భంగం కలిగించడానికి కాదనీ..
‘పెద్ది’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నా.. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ మహిళల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది.. ఏ పాత్రను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం మాకు లేదు..! సినిమాలో జాన్వీ కపూర్ ప్రెజెంటేషన్ ఎవరినైనా బాధించి ఉంటే.. ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ హృదయపూర్వక క్షమాపణలు చెప్తున్నాను..!మారుతున్న ప్రేక్షకుల ఆలోచనలు, సెన్సిటివిటీస్‌కు బాధ్యత వహిస్తామని.. భవిష్యత్తులో మహిళా పాత్రలను మరింత గౌరవప్రదంగా చూపిస్తామని ప్రామిస్ చేస్తున్నట్లు బుచ్చిబాబు తమ ట్విట్టర్ ప్రకటనలో పేర్కొన్నాడు..!
మొత్తం మీద సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితిలో ఈ వివాదం పెద్ది మేకర్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది..!
ఒక మంచి సినిమా అందించేందుకు తాము చేసిన ప్రయత్నం ఇలా వివాదాస్పదం కావడం వారికి మింగుడుపడటం లేదని సన్నిహితులు చెబుతున్నారు..!
•••••••
A Report By
ShyamaSundar Akula
9010746999




Comments