top of page

దుమ్మురేపుతున్న రాతిరి..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 53 minutes ago
  • 1 min read

రాతిరి రాతిరి రాతిరిలో తెలుగు ఫోక్ సాంగ్ దుమ్మురేపుతోంది..!


యూట్యూబ్ లో ఇప్పటికే కోటి మంది (పది మిలియన్ల) వ్యూస్ సాధించింది..


విడుదలైన నెల రోజుల్లోనే ఈస్థాయిలో ఆదరణ పొందడం విశేషమే..!


ఏడాదిన్నరగా అనేక ప్రైవేట్ తెలుగు సాంగ్స్ విడుదలవుతున్నప్పటికీ.. కొన్ని మాత్రం విపరీతమైన క్రేజ్ తో రికార్డు వ్యూస్ సాధిస్తున్నాయి..



ప్రైవేట్ సాంగ్స్ ధాటికి టాలివుడ్ బాలివుడ్.. ఏ వుడ్ సాంగ్స్ కూడా నిలబడకుండా పోతున్నాయి...


లక్షలు.. కోట్లు వసూల్ చేసే సినీ మ్యూజిక్ డైరెక్టర్ల బెస్ట్ కంపోజింగ్ సాంగ్స్ కూడా ప్రైవేట్ కంపోజర్స్ ముందు నేల చూపులు చూసే పరిస్థితి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది..


వీడియో క్వాలిటీ.. లొకేషన్.. క్యాస్ట్యూమ్స్.. కోరియోగ్రఫీ.. సాంగ్ కాన్సెప్ట్ ను బట్టి డ్యాన్స్ మూమెంట్స్.. ఫేస్ ఫీలింగ్ మూమెంట్స్.. ఇలా ఏ విధంగా చూసిన సినిమా పాటలను మించి అన్నట్లుగా యువ కళాకారులు అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు...


రానూ బొంబాయికి రానూ అంటూ.. వచ్చిన ప్రైవేట్ సాంగ్ తెలుగునాట దుమ్ము రేపింది..


ఫంక్షన్లూ ఈవెంట్లు పార్టీలు.. ఫ్రెండ్స్ మీటింగ్.. ఎక్కడైనా సరే ఈ పాట వేసుకుని డ్యాన్స్ చేయాల్సిందే అన్నట్లుగా ట్రెండింగ్ గా నిలిచింది గతేడాది...


ఈ పాట ఏ స్థాయికి వెళ్లిందంటే.. చివరికి ప్రపంచ సుందరీమణులు కూడా హైదరాబాద్ లో నిర్వహించిన మిస్ వరల్డ్ ఈవెంట్ లలో హుషారుగా స్టెప్పులు వేసేంత..!


రానూ బొంబాయికి రానూ తర్వాత వచ్చిన

పేరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది... జనాల నోళ్లలో ఇప్పటికీ నానుతోంది...


మంగ్లీ లేటెస్ట్ ఫోక్ సాంగ్ బాయిలోనా బల్లిపలికే... కూడా ట్రెండింగ్ లో ఉంది...


తాజాగా వచ్చిన రాతిరి రాతిరి రాతిరిలో ఫోక్ సాంగ్ ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ చేరువలో ఉంది.. గత నెల సంక్రాంతి ముందు విడుదలైన ఈ ఫోక్ సాంగ్ నెలరోజుల్లోనే ఒక కోటి వ్యూస్ చేరువలో ఉందంటే యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లోకి వెళ్ళినట్లే..!

చూడాలి ఇంకెన్ని వ్యూస్ సాధిస్తుందో ముందు ముందు...!



ఈ సాంగ్ ను సింగర్ నర్సింలు, ఉష ఆలపించగా..కృష్ణుడు సంగీతం అందించాడు..

సంతోష్, ప్రశాంత్ లిరిక్స్ అందించారు.మాధురి రాథోడు, ఈశ్వర్ సాయి నటించారు..!


•••••••

A Report By

ShyamaSundar Akula

9010746999

•••••••


Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page