top of page

పొలిటికల్ ఫార్ములా..!

Writer: Writer Desk
Writer Desk
Apr 27
2 min read

భలే మంచి కండువా భేరమూ..!


సోషల్ మీడియా.. ప్రీపెయిడ్ ఫార్ములా..! వీటినే నమ్ముకుని ముందుకు వెళ్తోందా..!


ఆ పార్టీలో ఆ నాటి వెలుగులు ఇక గత వైభవమేనా..!


కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అయిన పార్టీ.. దశాబ్ద కాలం కొత్త రాష్ట్రాన్ని రూల్ చేసిన పార్టీ.. అధికారం కోల్పోయాక క్రమేణ ప్రభ కోల్పోతున్న పార్టీ.. ఆ పార్టీ ఏదో మీకు అర్థం అయ్యే ఉంటుంది..!


పార్టీ క్యాడర్ కు అండగా నిలవాల్సిన వర్కింగ్ నాయకత్వం వీకెండ్స్ లో చిల్ అవడానికే ప్రయారిటీ ఇస్తున్నది.. దిశా నిర్దేశం చేయాల్సిన అగ్రనాయకత్వం అవసరం ఉంటే తప్ప కాలు బయట పెట్టదు.. వెరసి నాయకత్వంపై క్యాడర్ లో నమ్మకం సన్నగిల్లుతోంది..!


క్యాడర్ లో జోష్ నింపేందుకు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసే ఓపిక పార్టీ నాయకత్వానికి లేనట్లు ఎందుకు అనిపిస్తోంది..!


మరి ఏం చేస్తే క్యాడర్ లో నమ్మకం పెరుగుతది.. అనే ప్రశ్నలకు వీకెండ్ చిల్ లీడర్ ఓ ఫార్ములా కనిపెట్టాడు..!

అదే.. ప్రీపెయిడ్ కండువా ఫార్ములా...!


ఇటీవల ఓ సీనియర్ లీడర్ ఆయన సొంత నియోజకవర్గ కేంద్రంలో పార్టీలో చేరారు..! పార్టీ అగ్రనేత ఏడాది తర్వాత అజ్ఞాత వాసం వీడి బయటికి వచ్చి ఆ సీనియర్ లీడర్ కు కండువా కప్పారు..! ఇది అందరికీ తెలిసిన స్టోరీ.. కానీ దీనివెనుక భారీ ప్రీపెయిడ్ ఫార్ములా ఉందని ఆ పార్టీలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది..!


కోట్లాది రూపాయల పేమెంట్ చేసే, సభ ఏర్పాట్లు, ఫ్లెక్సీలు సహా అన్ని ఖర్చులు పెట్టి భారీ సభ నిర్వహిస్తేనే కండువా కప్పుకుంటానని ఆ సీనియర్ తేల్చిచెప్పారు.. లేదంటే ఇంకో పార్టీ అంతకు మించిన మొత్తం ఆఫర్ చేస్తుందని ఒకింత బ్లాక్ మెయిల్ కూడా చేశారనీ ఇన్సైడ్ టాక్..! తమకూ భారీగా గిట్టుబాటు అవుతుందని ఆశించిన వాళ్ళకి కాస్త కూడా దక్కకపోవడంతో ఇపుడు వాళ్లే తమ నాయకుడి ప్రీ పెయిడ్ లబ్ధి విషయాన్ని బయటికి లీక్ చేస్తున్నారని లోకల్ టాక్..!


అసలే సోషల్ మీడియాకు పరిమితమైన పార్టీగా ముద్ర వేసుకున్న పరిస్థితిలో.. ఆ సీనియర్ చేజారితే క్యాడర్ బేజారు అవుతుందనే భయంతో ఆయన అడిగినన్ని కోట్లు కుమ్మరించి కండువా కప్పి మందలో కలుపుకున్నారని కూడా టాక్ జోరుగా నడుస్తోంది..!


దక్షిణ తెలంగాణ కు చెందిన ఒక కాంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కు లక్షల్లో ప్రేమయిడ్ పేమెంట్ చేసి వీకెండ్ చిల్ లీడర్ కండువా కప్పారని ఇక్కడ కూడా టాక్ నడుస్తోంది..!



ఈ ప్రీపెయిడ్ ఫార్ములా ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.. సక్సెస్ అయితే ఒకే కానీ.. వికటిస్తే.. భారీ మూల్యం తప్పదనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్ లో వ్యక్తమవుతోంది..!


ఇప్పటికే సోషల్ మీడియా పార్టీ అనే అపవాదుకు తోడు ఇపుడు ప్రీపెయిడ్ ఫార్ములా జత కలవడంతో అసలు పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న బెంగ క్యాడర్ ను కలవరానికి గురిచేస్తోంది..!


మొత్తానికి..బలే మంచి కండువా భేరమూ..! ఫార్ములా .. టాక్ ఆఫ్ ది సర్కిల్ అయిపోయింది..! భవన్ లో పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతోంది..!


••••••••••

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page