
పోస్టర్లు చించేశారు.. గుడ్ బై చెప్పేస్తారా..!
- Writer Desk

- Mar 16
- 2 min read
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం చోటు చేసుకోబోతోంది..
పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం .!
ఆయన త్వరలో గులాబీ పార్టీలో చేరనున్నట్లు కూడా తెలుస్తోంది..,!
తాజాగా జీవన్ రెడ్డి నివాసం.. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సీలు బ్యానర్లను ఆయన అనుచరులు తొలగించారు. దీంతో పార్టీ వీడటం ఖాయమని తేలిపోయింది..

ఉగాది తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందని తెలుస్తోంది..అయితే ఆయన అనుచరులు మాత్రం ఉగాది లోపే రాజీనమచేయడం ఖాయమని చెబుతున్నారు...!
పార్టీ మారడంపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్ రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోయాయని తెలుస్తోంది..! జీవన్ రెడ్డి అధికారికంగా నిర్వహిస్తున్న సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించిన డీపీ లో కూడా కాంగ్రెస్ పేరు లోగో కనిపించకుండా మార్చేసినట్లు తెలుస్తోంది..!
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక..రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తనను టార్గెట్ చేసి అవమానిస్తున్నారని గత రెండేళ్లుగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ పార్టీ పంచన చేరి అన్నివిధాల పార్టీని బ్రష్టు పట్టిస్తున్నాడని.. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే సంజయ్ రెచ్చిపోతున్నాడని.. పార్టీ సీనియర్ నేతగా ఉన్న తనను అడుగడుగునా అవమానించడమే కాకుండా.. నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన పార్టీ పెద్దల ముందు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు..!
తనను కాదని.. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలు నేతలను కాదని.. సంజయ్ వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. అధిష్టానం చర్యలవల్ల నిజమైన కార్యకర్తలు నేతలు అన్యాయానికి గురవుతున్నారని.. ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ పెద్దలకు సూచించారు..!

పీసీసీ అధ్యక్షుడు..రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్..డిల్లీ నుండి వచ్చిన పెద్దలు కూడా తన ఫిర్యాదులను వాస్తవ పరిస్థితులను ఏ మాత్రం పట్టించుకోక పోగా.. తనపైనే ఉల్టా ఆరోపణలు చేసి సర్దిచెప్పి ప్రయత్నాలు చేస్తున్నారని..!
ఇంత దారుణంగా అవమానిస్తున్న పార్టీలో ఇక తను ఉండటం శ్రేయస్కరం కాదని..ఇంకా ఇక్కడే ఉంటే తన రాజకీయ మనుగడ ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని.. అందువల్లే తాను ఒక నిర్ణయానికి వచ్చానని.. మీరందరూ తననిర్ణయానికి సహకరించాలని ఇటీవల ఆయన కార్యకర్తలు.. ముఖ్య అనుచరులను కోరినట్లు తెలిసింది.. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మార్పు ఖాయమని తేలిపోయిందని స్థానిక నేతలు చెబుతున్నారు..

మున్సిపల్ ఎన్నికల వివాదం..!
జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ గెలుపుపై జీవన్ రెడ్డి ఒక విధమైన నిర్వేదం వ్యక్తం చేశారు.. నిజానికి ఈ ఎన్నికలలో జీవన్ రెడ్డి వర్గం సత్తా చాటుకుంది.. అయితే సంజయ్ రాజకీయ ఎత్తుగడంతో తన వర్గానికి చెందిన మహిళకు చైర్మన్ పదవి ఇప్పించున్నాడు.. వైస్ చైర్మన్ పదవిని జీవన్ వర్గానికి ఇచ్చిన అధిష్టానం జీవన్ రెడ్డి సూచించిన వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చేందుకు నిరాకరించింది..! దీంతో తీవ్ర ఆగ్రహానికి ఆవేదనకు జీవన్ రెడ్డి గురైనట్లు సన్నిహిత నాయకులు చెబుతున్నారు..!
పదవులు కాంట్రాక్టులు ఎర వేస్తూ తన స్వార్థం కోసం పార్టీని పూర్తిగా బ్రష్టు పట్టిస్తున్న సంజయ్ కు రేవంత్ రెడ్డి పూర్తి అండగా నిలవడం తీవ్ర అన్యాయమని.. ఇప్పటికైనా సంజయ్ ఆగడాలను సీఎం.. పీసీసీ అధ్యక్షుడు గుర్తిస్తే మంచిదని..చౌకబారు రాజకీయాలతో అధికారంలో ఉన్న పార్టీని పూర్తిగా నాశనం చేస్తున్నారని..జీవన్ రెడ్డి లాంటి నాయకుడిని పొగబెట్టి బయటకి పంపించడానికి జరిగిన కుట్ర నిజంగా ఆవేదనకు గురిచేస్తుందని జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు.. ఆయన స్నేహితుడు వాపోయారు..!
కేసీఆర్ తో మాట్లాడిన తర్వాతనే..!
మున్సిపల్ ఎన్నికల తర్వాత పరిణామాల నేపథ్యంలో
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో కేటీఆర్ జీవన్ రెడ్డి తో మాట్లాడినట్లు తెలుస్తోంది.. ఆయన పలుమార్లు జీవన్ రెడ్డితో మాట్లాడి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.. కేసీఆర్ తో కూడా జీవన్ రెడ్డిని మాట్లాడించినట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు..! కేసీఆర్ తో చర్చించిన తర్వాతనే ఆయన పార్టీ మార్పుపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది..!
జీవన్ రెడ్డి తో మాట్లాడిన కవిత..!
మరోవైపు కల్వకుంట్ల కవిత కూడా జీవన్ రెడ్డితో మాట్లాడినట్లు తెలుస్తోంది. తను త్వరలో ఏర్పాటు చేయబోయే పార్టీలోకి రావాలని.. పార్టీకి అండగా నిలవాలని కోరినట్లు తెలుస్తోంది...
నిజానికి జీవన్ రెడ్డితో కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ పరిచయం ఉంది.. గతంలో జగిత్యాల ఇంచార్జ్ గా ఉన్న కవిత సంజయ్ గెలుపు కోసం స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి కి తగిన గౌరవం ఇచ్చేవారు కవిత..! రాజకీయంగా విమర్శలు చేసినప్పటికీ వ్యక్తిగతంగా ఆయనను కవిత గౌరవించేవారు. తన తండ్రి సమాంతర నాయకుడు కావడంతో ఆ విధంగానే పరిగణించేవారు.
అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీ ఆర్ ఎస్ లో చేరడంపైనే ఆసక్తి చూపుతున్నారని.. ఆ పార్టీలో చేరడం..కాంగ్రెస్ ను వీడటం లాంఛనమే అని జగిత్యాల నేతలు చెబుతున్నారు..!
••••••••••
A Report By
ShyamaSundar Akula
9010746999




Comments