
కవిత పార్టీ పేరు టీఆర్ఎస్..!
- Writer Desk

- 2 days ago
- 1 min read
Exclusive NEW SENSE
పార్టీ స్థాపన రోజే తండ్రి పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది కవిత..!
పార్టీ పేరు విషయంలో వ్యూహాత్మక అడుగు వేసింది..!
తెలంగాణ జాగృతి.. ప్రజా జాగృతి.. ప్రజా వికాస జాగృతి అంటూ.. అనేక పేర్లు లీక్ చేయించింది..! రిజిస్ట్రేషన్ విషయంలో కూడా తెలంగాణ ప్రజా జాగృతి ఫైనల్ అంటూ కవిత ముఖ్య అనుచరులు పక్కాగా నిర్ధారించారు...!
కానీ కాసేపటి క్రితమే ఈ ట్విస్ట్ ఇస్తూ సమాచారం వచ్చింది..!
పార్టీ పేరు టీఆర్ఎస్ అంటూ కవిత పార్టీ వర్గాల నుండి సమాచారం అందుతోంది..!
ఈ విషయంలో కవితతో మాట్లాడడానికి న్యూ సెన్స్ ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదు..!

మొత్తంగా పార్టీ స్థాపన రోజు.. ఇలా ట్విస్ట్ లు ఇవ్వడంలో మరేదైనా పబ్లిసిటీ స్టంట్ ఉందా.. లేక నిజంగానే ఆమె పార్టీ పేరును టీఆర్ఎస్ గా నామకరణం చేసిందా అనేది కాసేపట్లో తేలిపోతుంది..!
ఇటీవల టీఆర్ఎస్ పేరుపై కవిత ప్రస్తావన తెచ్చారు..!
ఆమె స్థాపించే పార్టీ పేరుపై మీడియా అడిగిన ప్రశ్నకు ఇంకా ఫైనల్ చేయలేదని.. టీఆర్ఎస్ పేరు కూడా ఖాళీగానే ఉందని మాట్లాడారు.. దీంతో కొంత అలజడి మొదలైంది..కవిత ఆ పేరు ను ప్రత్యేకంగా ప్రస్తావించి.. ఇంకా ఖాళీగానే ఉందని చెప్పడంతో.. గులాబీ పార్టీ నేతలు కొంత కలవరానికి గురయ్యారు..
కవిత వ్యాఖ్యల తర్వాత కేటీఆర్ కూడా ఈ విషయంపై మాట్లాడారు..పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని డిమాండ్ ఉందని.. తాము కూడా పరిశీలిస్తున్నామని.. త్వరలో పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు..
కట్ చేస్తే ఇపుడు కవిత ఇలా ట్విస్ట్ ఇవ్వడం గులాబీ నేతలకు.. ముఖ్యంగా కేసీఆర్ కేటీఆర్ కు బిగ్ షాక్ అనిచెప్పాలి..!
....
A Report By
ShyamaSundar Akula
9010746999
.....




Comments