
అన్నని వదిలి హరీష్ పై బాణం..!
- Writer Desk
- 5 days ago
- 1 min read
హైదరాబాద్ : కవితక్క తెలివితో వ్యవహరించారా.. లేక అన్న చెల్లెళ్ళు కలిసి బంతిని మిగిలిన ఇద్దరి కోర్టులోకి నెట్టేశారా...
మొన్నటిదాకా అన్నపై విరుచుకుపడిన కవిత... సడన్ గా వాయిస్ ఎందుకు మార్చారు...!
పార్టీలో కీలకనేత తనను టార్గెట్ చేశారని ఆ మధ్య అమెరికా వెళ్ళేముందు చెప్పారు...
అమెరికా వెళ్ళాక సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం నుండి కవితకు పూర్తిస్థాయిలో స్థానం లేకుండా చేసేలా కేటీఆర్ పావులు కదిపారు..
తనను తప్పించడంపై అమెరికా నుండి లేఖ రాసిన కవిత... ఇపుడు దృష్టి హరీష్ సంతోష్ పై ఎందుకు పెట్టారు...
సంతోష్ పై గతంలోనే పరోక్ష ఆరోపణలు చేసిన కవిత..తర్వాత ఎందుకు మళ్లీ సంతోష్ మాట ఎత్తలేదు. !
కవిత నిజంగానే అదృష్ట శక్తి ఆదేశాల ప్రకారమే వాళ్ళ స్క్రిప్ట్ ను వాయిస్ గా వినిపిస్తున్నారా..!?
దయ్యాలు ముగ్గురేనా... ఇంకా ఎవరైనా ఉన్నారా...
రజతోత్సవ సభలో ప్రసంగాన్ని తప్పుపట్టి లేఖ రాసిన కవిత.... ఆ లేఖలోని ప్రాధాన్య అంశాలను ఇపుడు ఎందుకు లేవనెత్తడం లేదు..!
తండ్రిని పల్లెత్తు మాట అనకూడదు.. కానీ తండ్రి నడిపించే పార్టీని తియ్యిపోయాలి అంటే ఎలా కుదురుతుంది...!
కేటీఆర్.. హరీష్.. సంతోష్.. జగదీష్ రెడ్డి.. తర్వాత ఎవరు..?
కాంగ్రెస్ టార్గెట్ ను కవిత అనుసరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది కదా..,?
టార్గెట్ ఎప్పటికప్పుడు మారుతుండటం దేనికి సంకేతం..!?
కేసీఆర్ పై చావు విమర్శలు చేసిన రేవంత్ ను ఎందుకు నిలదీయడం లేదు..? ఎందుకు విమర్శించడం లేదు..?
....
Comments