
గట్టిగా కొట్టేశారు..!
- Writer Desk

- Feb 27
- 2 min read
తమిళ రాజకీయాల్లో ఒక భారీ కుదుపు..! కొత్తగా వచ్చిన తమిళగ వెట్రి కళగమ్ పార్టీలో అలజడి..!
ఒకేరోజు చోటుచేసుకున్న రెండు ఆసక్తికరమైన పరిణామాలు ఎన్నికల వేళ రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.. ఈ పరిణామాలు రాజకీయ వాతావరణాన్నే మార్చివేసే పరిస్థితి కనిపిస్తోంది..
అందులో ఒకటి ముఖ్యమంత్రిగా మూడు సార్లు రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించిన పన్నీర్ సెల్వం అధికార డీఎంకే పార్టీలో చేరడం.. ఇంకొకటి టీవీకే చీఫ్.. అగ్రనటుడు విజయ్ సతీమణి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడం..!
మాజీ సీఎం.. అన్నా డీఎంకే అధినేత్రిగా తమిళ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన దివంగత నాయకురాలు జయలలితకు వీర విధేయుడుగా పన్నీర్ సెల్వం గుర్తింపు పొందారు.. సీఎం గా కొనసాగుతున్న సమయంలో ఆమె అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన సందర్భంలో అనారోగ్యానికి గురైన పరిస్థితుల్లో జయలలిత పన్నీర్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు.. అంతటి నమ్మకస్తుడిగా పన్నీరుకు గుర్తింపు ఉంది..! అప్పటి రాజకీయ పరిస్థితుల్లో మూడు పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు..! 2016 లో
జయలలిత మరణం తరువాత అన్నా డీఎంకేపై పట్టు సాధించడానికి జయలలిత సన్నిహితురాలు శశికళ చేసిన ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి..! మరోవైపు పార్టీలో నెంబర్ టూ గా ఎదిగిన పళనీస్వామి కూడా విభేదాలను పక్కనబెట్టి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి మరీ శశికళను అడ్డుకున్నాడు. నిజానికి పన్నీర్ సెల్వం ను అడ్డుకోవడానికి శశికళ వ్యూహాత్మకంగా పళనీస్వామికి మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రి అయ్యేవిదంగా అండగా నిలిచింది.. అప్పటి పరిణామాల్లో సీఎం గా పళనీస్వామి, డిప్యూటీ సీఎం గా పన్నీర్ సెల్వం కొనసాగారు..! వాళ్లిద్దరు కలిసి శశికళకు చెక్ పెట్టారు.

గత అయిదేళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ అంతర్గత విభేదాలతో సమర్ధవంతమైన పాత్ర పోషించలేకపోయింది.. ఈ లోగా పళనీ.. పన్నీర్ మధ్య విభేదాలతో పన్నీర్ ను 2022 లో పార్టీ నుండి బహిష్కరించారు.. అప్పటినుండి ఆయన తన రాజకీయ భవితవ్యంపై మౌనంగా ఉండిపోయారు.. అంతర్గతంగా తన పని తాను చేసుకుంటూ తనకి పట్టు ఉన్న ప్రాంతాలలో నేతలను కలుస్తూ వస్తున్నారు.. తాజాగా ఆయన అధికార డీఎంకే లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఇదే సమయంలో శుక్రవారం ఉదయం అనుకోని పరిణామం చోటుచేసుకుంది.. చెన్నైలోని డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయానికి వచ్చిన పన్నీర్ సెల్వం.. డీఎంకే అధ్యక్షుడు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిశారు. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు..!

పన్నీర్ డీఎంకేలో చేరికపై రాష్ట్రంతో పాటు సౌత్ ఇండియా రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న సమయంలోనే మరో సంచలన వార్త బయటకు వచ్చింది..!
కొత్త పార్టీ పెట్టీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సినీ నటుడు విజయ్ సతీమణి కోర్టులో విడాకుల పిటిషన్ వేసిన విషయం బయటకు వచ్చింది.. దీంతో తమిళ రాజకీయాల్లో అలజడి మొదలైంది..!
రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసే విధంగా చోటుచేసుకున్న పరిణామాలను తమిళనాట పొలిటికల్ బిగ్ ఫ్రైడే గా పిలుస్తున్నారు..
•••••••••••
చావుదెబ్బ కొట్టింది ఎవరు..?

•••••••••••
త్వరలో....
A Report By
ShyamaSundar Akula
9010746999




Comments