top of page

నో పోస్టింగ్..! అదే కారణమా..?

Writer: Writer Desk
Writer Desk
Feb 26
1 min read

రాష్ట్రంలో పాలనా పరంగా భారీ కుదుపు..! భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త చర్చకు తెరలేపింది..! పంచాయతీ ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిషత్ ఎన్నికలలో ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈ బదిలీలపై రకరకాల చర్చ మొదలైంది..!

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పొడిగింపు పదవీకాలం కూడా ముగుస్తున్న సందర్భంలో ఈ బదిలీలపై ఆసక్తి నెలకొంది..!


ఇక ఇదే సమయంలో ఒక శాఖకు నిర్వహణ అధికారిగా ఉన్న ఐఏఎస్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం కూడా ఆసక్తిగా మారింది..


ఆయన అవినీతి వ్యవహారంపై ప్రభుత్వ పెద్దలకు స్వయంగా సంబంధిత శాఖ మంత్రి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దలు లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది..తన మాటను లెక్కచేయకపోవడంతో ఆగ్రహంతో ఉడికిపోయిన మంత్రి కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.. శాఖకు చెందిన ఇతర కిందిస్థాయి అధికారుల ముందే సదరు ఐఏఎస్ అధికారిని మంత్రి కడిగిపారేయడంతో ఆయన మనస్థాపంతో సెలవుపై వెళ్లినట్లుగా ప్రముఖ దినపత్రిక

ఆంధ్రజ్యోతి సంచలన కథనాన్ని ప్రచురించింది.. కొందరు అధికారులపై ఆరోపణలు.. ప్రభుత్వ అంతర్గతకు చెందిన వివరాలు.. నిర్ణయాలు వ్యూహాలు బయటకి పొక్కుతున్న వైనంపై కూడా ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.. కొందరు ఉన్నతాధికారులు ప్రతిపక్ష పార్టీకి సమాచారాన్ని లీక్ చేస్తున్న వ్యవహారం కూడా ఆ మధ్య ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది..


ప్రస్తుత బదిలీలకు సంబంధించి అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..!



అరవింద్ కుమార్ పై చర్యలకు సిద్ధమా..?

డిసాస్టర్ మేనేజ్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐ ఏ ఎస్ అరవింద్ కుమార్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ హయంలో కీలకంగా వ్యవహరించిన ఆయనపై ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేసులు నమోదయ్యాయి.. ఆయన ఏసీబీ విచారణకు ఎదుర్కొంటున్నారు..! అరవింద్ కుమార్ మీ ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతులు రావడంతో ఇక చర్యలకు సిద్ధమవుతూ నట్లుగా కనిపిస్తోంది.. ఆయనను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చిన ప్రభుత్వం తదుపరి పోస్టింగ్.. ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.. దీంతో ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వ పెద్దల ఆలోచన ఉన్నట్లుగా కనిపిస్తోంది.. ఫార్ములా కేసులో కేటీఆర్ తర్వాత అరవింద్ కుమార్ కీలకంగా వ్యవహరించి ఫార్ములా సంస్థకు నిధుల చెల్లింపులో అవకతవకలకు పాల్పడినట్లుగా అభియోగాలు నమోదు చేశారు..!


•••••

A Report By

ShyamaSundar Akula

9010746999

•••••

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page