
భార్యకు షాక్ ఇచ్చిన విజయ్..! త్రిషతో...!
- Writer Desk

- 5 days ago
- 2 min read
విడాకులు కోరిన భార్య సంగీతకు విజయ్ గట్టి షాక్ ఇచ్చాడా..!
తమిళ అగ్ర నటుడు.. టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం కొత్త మలుపు తీసుకుంటోందా..
ఆయనకు మరో నటితో వివాహేతర సంబంధముందని ఆరోపిస్తూ.. తనకి విజయ్ తో విడాకులు ఇప్పించాలని ఇటీవల కోర్టును ఆశ్రయించిన బార్య సంగీత..!
భార్య కోర్టును ఆశ్రయించడంతో కాస్త షాక్ కు గురైనవిజయ్..!
అంతలోనే కొత్త నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్న విజయ్..!
భార్య కోర్టుకు వెళ్ళిన వారం రోజుల్లోనే విజయ్ ఆమెకు రివర్స్ షాక్ ఇచ్చాడు..!
ఏ నటితో సంబంధం ఉందని భార్య ఆరోపించిందో.. అదే నటితో ఒక శుభకార్యానికి విజయ్ హాజరయ్యాడు..!
ఒకే కారులో వచ్చి ఫంక్షన్ లో దంపతుల మాదిరిగా చెట్టాపట్టాలేసుకుని హుషారుగా కనిపించారు...
ఇద్దరు కలిసి శుభకార్యంలో కొత్త దంపతులను ఆశీర్వదించారు..!

విజయ్ వెంట వచ్చిన ఆ నటి ఎవరో కాదు..! తెలుగు తమిళ్ సహా దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష..!
త్రిష విజయ్ ల మధ్య లియో సినిమా నుండి మొదలైన ఫ్రెండ్ షిప్ అంతకు మించిన సాన్నిహిత్యానికి దారితీసింది..!
గత ఐదారేళ్లుగా ఇద్దరు కలిసి టూర్లు వేశారు..!
వీళ్ళ వ్యవహారం తెలిసే విజయ్ భార్య ఐదేళ్ల క్రితం విజయ్ తో గొడవ పడింది.. అయితే త్రిషతో సంబంధాలు తెంచుకుంటానని ప్రామిస్ చేసిన విజయ్ మాట తప్పాడని.. ఆమెతో సంబంధాన్ని యధావిధిగా కొనసాగిస్తున్నాడని.. ఇక అతన్ని భరించడం తన వల్లకాదని ఇటీవల సంగీత ఆరోపించారు..! విజయ్ తో కలిసి తాను ఉండలేనని.. విడాకులు కావాలని కోరుతూ గత నెల 27న ఆమె కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు..! ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత 26 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకోవడానికి సంగీత సిద్ధపడ్డారు...

విజయ్ తప్పు చేస్తున్నాడా..?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళుతున్న విజయ్ కు ఈ పరిణామం ఇబ్బంది కరంగా ఉంటుందని అందరూ భావిస్తున్న సమయంలో
. భార్య సంగీత సహా అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చేవిధంగా.. త్రిషతో కలిసి ఆయన ప్రముఖ వ్యాపారవేత్త.. సినీ నిర్మాత కల్పతి ఎస్ సురేష్ మీనాక్షి దంపతుల కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.. ఒకే కారు లో ఫంక్షన్లో వచ్చిన విజయ్ త్రిష జంట మొత్తం ఫంక్షన్ కే హైలైట్ గా నిలిచారు..! త్రిష తో కలిసి విజయ్ ఫంక్షన్ల హాజరుకావడం.. భార్య భర్తల.మాదిరిగా ఇద్దరు కలిసి అక్కడ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళుతున్న విజయ్... ఇలా భార్యతో విడాకుల వివాదం మొదలవ్వగానే ఏకంగా తన లవర్ తో బాహాటంగా తిరగడం.. ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపిస్తుందని.. భారతీయ వైవాహిక వ్యవస్థను అవమానపరిచే విధంగా విజయ్ వ్యవహార శైలి ఉందని.. రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఆయన ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు..? ఇంత బరితెగింపు మంచిది కాదు..! అనే విమర్శల దాడి రాజకీయ విశ్లేషకుల నుండి మొదలైంది..!
•••••••••
A Report By
ShyamaSundar Akula
9010746999




Comments