top of page

మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు..!

Writer: Writer Desk
Writer Desk
Aug 2, 2025
1 min read

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశం..!

ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో.. కొండా సురేఖపై 21 ఆగస్టు 2025 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసు జారీ చేయాలన్న కోర్టు.!


కేటీఆర్‌పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు!


ఫిర్యాదుతోపాటు సాక్ష్యుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్ల పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సురేఖపై కేసు నమోదుకు ఆదేశించిన కోర్టు!

.....

ఫోన్ ట్యాపింగ్.. అక్కినేని నాగచైతన్య ప్రముఖ నటి సమంతకు సంబంధించి మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.! దంపతులు నాగ చైతన్య, సమంత లు విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరి ఫోన్లు అక్రమంగా ట్యాపింగ్ చేసి ఇద్దరి మధ్య వివాదం సృష్టించి విడిపోవడానికి కేటీఆర్ కారణమయ్యాడని ఆమె ఆరోపించారు.


మంత్రి హోదాలో సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టించాయి. దేశవ్యాప్తంగా సురేఖపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధానంగా సినీరంగ ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఒక రాష్ట్ర మంత్రి హోదాలో సురేఖ చేసి ఆ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కేటీఆర్ కోర్టు ను ఆశ్రయించారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి సురేఖ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది..!


Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page