
నిర్దోషిగా బయటపడతా..!

తాను ఏ తప్పు చేయలేదని.. నిర్దోషిగా నిరూపించుకుంటా అంటున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్..!
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఎంపీ మహేష్ పట్టుబడిన విషయం విదితమే..! ప్రస్తుతం స్టేషన్ బెయిల్ పై ఉన్న ఆయన ఆదివారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు.. అందులో తాను ఏ తప్పు చేయలేదని. డ్రగ్స్ తీసుకోలేదని.. బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు..!
ఎంపీ వ్యవహారంపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని.. ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేసింది.
దీంతో ఆయన ఈరోజు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి.. పార్టీ నిర్ణయానికి సంబంధించి వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశారు..!
••••••••

హైదరాబాద్ లో డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో తన పేరు రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఈ మేరకు ఏలూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దురదృష్టకర ఘటన నేపథ్యంలో, తాను ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని తనను ఎంపిగా గెలిపించిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు..!
హైదరాబాద్ లో జరిగిన ఘటనలో తన పేరు రావడంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్న ఎంపీ...ఆ రోజు డిన్నర్ కు వెళ్లిన మాట వాస్తవమే అని చెప్పారు..! తాను అక్కడ ఎటువంటి తప్పు చేయలేదని, విచారణలో నిర్ధోషిగా బయటకు వస్తానని చెప్పారు..!
ఈ అంశంపై పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తాననీ, అదే సందర్భంలో పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని, పార్టీ నుండి అందిన నోటీసుపై లిఖిత పూర్వకంగా అధిష్టానానికి వివరణ ఇస్తాననీ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ సంఘటన నుంచి, తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి ఎప్పటి మాదిరిగానే కట్టుబడి పనిచేస్తానని ఏలూరు నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నానని తన ప్రకటనలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు..!
••••••••••




Comments