
కలయిక అంతరార్థం ఇప్పటికీ మిస్టరీనే..!
- Writer Desk
- 3 days ago
- 1 min read
హైదరాబాద్ :
తెరపైకి నాటి కలయిక..!
రెండవసారి వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక టిఆర్ఎస్ ను పూర్తిగా టార్గెట్ చేసిన వైఎస్సార్..!
టిడిపి పనికూడా ఫినిష్ అంటూ వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్..!
అదే సమస్యలో ముఖ్యమంత్రి వైఎస్సార్ ను కలిసిన హరీష్ రావు..!
రాజకీయంగా నాడు తీవ్ర దుమారం రేపిన కలయిక..!
వైఎస్సార్ కు పూలబొకే ఇస్తూ నవ్వుతూ హరీష్ రావు కనిపించడంతో నాడు తీవ్ర కలవరపాటుకు గురైన టీఆర్ఎస్..!

ఆ తర్వాత కొద్దిరోజులకే వైఎస్సార్ అకాల మరణం చెందడంతో రాజకీయంగా ఉమ్మడి రాష్ట్రంలో పెను మార్పులు సంభవించాయి..!
తాను నియోజకవర్గం డిగ్రీ కాలేజీ విషయంలో సీఎల్పీ కార్యాలయంలో ఉన్న ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లానని.. అయితే అక్కడ ఉండే రవిచంద్ అప్పటికప్పుడు నా చేతిలో పూల బొకే చేతిలో పెట్టీ ముఖ్యమంత్రి వద్దకు పంపించారని.. ఆ బొకే ఇస్తున్న సమయంలో ఫోటోలు కొట్టి వెంటనే మీడియాకు పంపించారని.. ఇదంతా తన ప్రమేయం లేకుండానే నిమిషములో జరిగిపోయిందని, వాళ్ళు తెలివిగా ఇరికించే ప్రయత్నం చేశారని, తాను వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని నాడు ఏబీఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో హరీష్ రావు చెప్పుకొచ్చారు

ఈరోజు మళ్లీ కవిత ఆ సంగతిని గుర్తు చేశారు..
వైఎస్సార్ ను హరీష్ రావు కలిసిన విషయాన్ని గుర్తుచేస్తూ ప్రతీ సమయంలోనూ కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రత్యర్థులతో హరీష్ రావు చేతులు కలిపేవారని ఆరోపణలు చేశారు..
నిజానికి హరీష్ రావు వైఎస్సార్ ను ఎందుకు కలిశారు.. కేవలం కాలేజీ కేటాయింపు గురించి అడగడానికి మాత్రమే కలిసారా..? పూలబొకే ఎవరో ఇస్తే ఎలా తీసుకెళ్తారు ఇవ్వడానికి.. వెనక్కి తిరిగి రావడమో, బొకే తీసుకోకుండా ఉండవచ్చు కదా.. ఆ ఫోటో చూస్తే అలా అనిపించడంలేదని.. హరీష్ రావు ఏదో ఆలోచనతోనే సీఎం ను కలిశారని అప్పట్లో విస్తృతంగా మీడియాలో.. రాజకీయ నేతల సమావేశాల్లో చర్చ జరిగింది..
ఇప్పటికీ ఆ కలయికలోని అంతరార్థం మిస్టరీగానే మిగిలిపోయింది..!
అంతే కాదు.. కలయిక ఫోటోను ఇంటర్ నెట్ లో లేకుండా చేయడానికి హరీష్ రావు చేసిన రాయత్నాలు కూడా అప్పట్లో అనుమానాలు బలంగా కొనసాగడానికి కారణమయ్యాయి..!

.....
Comments