
పాదయాత్ర మరోసారి..!

యాత్ర సినిమాలో దివంగత సీఎం వైఎస్ పాత్ర పోషించి పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువైన వైనాన్ని చూపించిన మమ్ముట్టి మరోసారి అదే తరహాలో పాదయాత్ర పేరుతో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు..
ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా.. ప్రజల్లో తనకంటూ బలమైన గుర్తింపు తెచ్చుకున్నారు.. ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ పథకాలతో చెరగని ముద్ర వేశారు.. ఆయన ప్రవేశ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రజల మదిలో చిరస్మరణీయ ముద్ర వేశాయి.. రెండు దశాబ్దాలు గడిచినా ఆ రెండు పథకాల పేర్లు చెబితే ప్రజలకు ఆయనే గుర్తొస్తారు..!

వైయస్ చేసిన పాదయాత్ర తెలుగునాట ఒక ట్రెండ్ సెట్టర్ గా మారింది.. ఉమ్మడి రాష్ట్రంలో.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఈ ట్రెండ్ రాజకీయాల్లో కొనసాగుతోంది... వైయస్ తరహాలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర ద్వారా రూపాలకు చేరువయ్యారు... 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ బాటలోనే పాదయాత్ర చేశారు.. ఆయన తనయుడు నారా లోకేష్ కూడా యువగళం పేరుతో 2024 ఎన్నికలకు ముందు పాదయాత్ర ద్వారా ప్రజలను కలిశారు.. ఎన్నికలలో టీడీపీ కూటమి విజయానికి లోకేష్ పాదయాత్ర కూడా ఒక కారణంగా నిలిచింది..

మొత్తంగా ఇప్పటికీ పాదయాత్ర అనేది ప్రజలకు చేరువయ్యే మార్గాల్లో కీలకమైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది..!
ఇక సినిమా విషయానికి వస్తే యాత్ర సినిమాలో నటదిగ్గజం మమ్ముట్టి నటన..! రాజశేఖర్ రెడ్డిలోని హుందాతనం రాజసం ఉట్టిపడేలా అచ్చుగుద్దినట్లుగా ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. సినిమా విజయంలో మమ్ముట్టి పాత్రనే కీలకంగా నిలిచింది..
ఇక ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది.. ఈరోజు టైటిల్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.. పాదయాత్ర అనే టైటిల్ ను సినిమాకు ఖరారు చేయడం ఇపుడు ఆసక్తికరంగా మారింది..

పేరుకు పాదయాత్ర అనే పేరు సినిమాకు పెట్టీ ఎప్పటికీ... అందులో కథాంశం.. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమానా లేక ఇంకేదైనా అంశంతో సినిమా కథ ఉండబోతోందా... అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ట్రెండ్ గా ఉన్న పాదయాత్ర. టైటిల్.. సినిమాకు ఇక్కడ క్రేజ్ తెచ్చిపెట్టడం ఖాయం..!
.......
A Report by
ShyamaSundar Akula
9010746999




Comments