top of page

విచారణకు రండి..! హరీష్ కు పిలుపు..!

Writer: Writer Desk
Writer Desk
Jan 19
1 min read

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల విచారణ కొనసాగుతోంది...


బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ను విచారణకు హాజరుకావాలంటూ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్న సిట్ తాజాగా నోటీసులు జారీ చేసింది...

నోటీసును ఇప్పటికే హరీష్ రావు ఇంటికి వెళ్ళి కుటుంబసభ్యులకు అందచేసినట్లు తెలిసింది.. పోలీసులు వెళ్లిన సమయంలో హరీష్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులకు నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో కొన్ని విషయాలకు సంబంధించి హరీష్ ప్రమేయం ఇతరత్రా సంబంధాలపై విచారణ చేయాల్సి ఉందని.. అందుకోసం

రేపు ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు..


అయితే, గతంలోనే తన ఫోన్ ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంలో విచారణ జరగ్గా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది..!


......

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page