top of page

PV Murali Krishna

  • Writer: Writer Desk
    Writer Desk
  • Jan 24
  • 3 min read

పత్రికా ప్రకటన


దక్షిణ మధ్య రైల్వే , ప్రిన్సిపాల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పి.వి. మురళీ కృష్ణ, ఐఆర్ఎస్ఎస్ఈ





దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ (పిసిఎస్టీఈ)గా శ్రీ పి.వి. మురళీ కృష్ణ గారు నేడు అనగా జనవరి 24, 2025న బాధ్యతలు స్వీకరించారు. శ్రీ పి.వి. మురళీ కృష్ణ గారు ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఎస్ఈ) లో 1990 బ్యాచ్ కు చెందినవారు.


శ్రీ పి.వి. మురళీ కృష్ణ గారు చెన్నైలోని ప్రీమియర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) పూర్వ విద్యార్థి, అనంతరం 1990లో ఎలక్ట్రానిక్స్ అండ్ కంమ్యూనికేషన్ లో పట్టభద్రుడయ్యాడు. అదే ఏడాది ఐఆర్ఎస్ఎస్ఈకి ఎంపికయ్యారు. ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), హైదరాబాద్ నుండి స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌లో అడ్వాన్స్‌డ్ కోర్సును కూడా శ్రీ పి.వి. మురళీ కృష్ణ గారు పూర్తి చేశారు.


1994లో బెంగళూరు డివిజన్‌లోని దావణగెరెలో అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్‌గా తన మొదటి పోస్టింగ్‌తో దక్షిణ రైల్వేలో ఆయన తన ఉద్యోగ వృత్తి ప్రారంభమైంది. 1996 మరియు 2007 మధ్య దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై డివిజన్ లో డివిజనల్ సిగ్నల్ & టెలికాం ఇంజనీర్/ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అనేక ముఖ్యమైన పనులను నిర్వహించారు. అలాగే సీనియర్ డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజనీర్, చెన్నై మరియు ప్రాజెక్ట్స్, డిప్యూటీ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజనీర్‌గా విధులు నిర్వహించారు . అనంతరం 2007 మరియు 2012 సికింద్రాబాద్‌లో జనరల్ మేనేజర్/ప్రాజెక్ట్స్‌గా రైల్‌టెల్ కార్పొరేషన్‌లో డిప్యుటేషన్‌పై చేరారు . ఈ ఐదేళ్లు విజయవంతంగా తన విధులు నిర్వహించారు. భారతీయ రైల్వేల కోర్ సిగ్నల్ అండ్ టెలికాం రంగంలో సాంకేతిక శిక్షణ లో అపారమైన అనుభవంతో 2012లో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ & టెలికమ్యూనికేషన్ (ఇరిసెట్ ) సికింద్రాబాద్‌లో ప్రొఫెసర్‌గా చేరేందుకు దోహదపడింది . శ్రీ పి.వి. మురళీ కృష్ణ గారు దక్షిణ రైల్వేకు తిరిగి వచ్చి మధురై డివిజన్‌లో అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు. పోదనూరులోని ఎస్ అండ్ టీ వర్క్‌షాప్‌కు చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ , చీఫ్ సిగ్నల్ ఇంజనీర్ , చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ మరియు దక్షిణ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్‌గా నియామకమయ్యారు .


2007లో దక్షిణ మధ్య రైల్వేలో రికార్డు స్థాయిలో 2000 కి.మీ. పొడవున్న ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ( ఓ ఎఫ్ సి ) వేయడంలో తన వృత్తిపరమైన విజయాలలో అత్యున్నత స్థానం, ఇది జోన్‌లో ఇబ్బందులు లేని టెలికాం కనెక్టివిటీకి బెంచ్‌మార్క్‌గా నిలిపింది . దక్షిణ మధ్య రైల్వే దక్షిణ రైల్వేలను కలుపుతూ దక్షిణ ప్రాంతంలో డెన్స్ వేవ్‌లెంగ్త్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ( డి డబ్ల్యు డి ఎం ) మరియు నెక్స్ట్ జెన్ నెట్‌వర్క్ (ఎన్ జి ఎన్) లను ప్రారంభించే పనులను అయన వృత్తిలో మరో కీలక మైలురాయి. ఈ సాంకేతికత ఒకే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా బహుళ కమ్యూనికేషన్ ఛానెల్‌లను ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తుంది .ఇది రైల్వేలలో కమ్యూనికేషన్ టెక్నాలజీలో అంతిమంగా పరిగణించబడుతుంది. 2012లో సికింద్రాబాద్‌లో రైల్‌టెల్ డేటా సెంటర్ రూపకల్పన, కీలకమైన నిర్ణయాలలలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇది రైల్వే వ్యవస్థ యొక్క టెలికమ్యూనికేషన్ బలాన్ని బాగా పెంచింది.


1996 మరియు 2002 మధ్య చెన్నైలోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌లో డివిజనల్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్‌గా ఆయన పనిచేసిన కాలంలో, లక్షద్వీప్ దీవులైన మినికాయ్, కవరట్టి మరియు అగట్టిలలో పి ఆర్ ఎస్ టెర్మినల్స్‌ను ప్రారంభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు . ఈ ద్వీపసమూహ ప్రజలకు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ను అనుసంధానం చేసారు . పోదనూర్‌లోని ఎస్ అండ్ టి వర్క్‌షాప్ కు ముఖ్య అధికారిగా విధులు నిర్వహించారు . శ్రీ పి.వి. మురళీ కృష్ణ గారు ఈ పదవీకాలంలో వర్క్‌షాప్‌కు 05 ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ( ఐ ఎం ఎస్ ) సర్టిఫికేషన్‌లను అందుకుంది. ఇలా అప్పటి కాలంలో భారతీయ రైల్వేలపై ఉన్న ఏకైక వర్క్‌షాప్ గా గుర్తింపు పొందింది. సికింద్రాబాద్‌లోని ఇరిసెట్ లో శ్రీ పి వి P.V. మురళీ కృష్ణ గారు తర్ఫీదు శిక్షణ ద్వారా అనేక మంది ఐ ఆర్ ఎస్ ఎస్ ఈ ప్రొబెషనర్లు ప్రయోజనం పొందారు. ఈ శిక్షణ కేంద్రంలో 2012 నుండి 2016 మధ్య నాలుగు సంవత్సరాలు ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. తన పదవీకాలంలో ఇరిసెట్ లో అత్యంత ఆధునిక సిగ్నల్ ల్యాబ్‌ను కూడా రూపొందించారు.

శ్రీ పి వి . మురళీ కృష్ణ గారు ప్రకృతి ప్రేమికుడు మరియు ఛాయాచిత్ర పట్ల ఆసక్తి వున్నా అధికారి . తన తీరిక సమయంలో అయన అభిరుచి ప్రకారం వాటిని నిర్వహించేవారు. వృత్తిపరమైన కెరీర్ సవాళ్లను స్వీకరించడానికి ధ్యానాన్ని ప్రధాన అంశంగా గుర్తించి, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సమయాన్ని వెచ్చించేవారు. అలాగే ఫిట్‌నెస్ గా వుండడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ను సమతుల్యం చేసుకునేందుకు దోహదపడుతుందని భావిస్తారు.



పి సి ఎస్ టి ఈ / ఎస్ సి ఆర్ గా శ్రీ సౌరభ్ బందోపాధ్యాయ విధులు నిర్వహించే సమయంలో ఎస్ సి ఆర్ కవచ్ - హై టెక్నాలజీ రైలు రక్షణ వ్యవస్థ ను విస్తరించడంలో

శ్రీ పి.వి. మురళీ కృష్ణ గారు విజయవంతంగా కృషి చేసారు. ఎల్ టి ఈ రైల్వేలో సమాచార వ్యవస్థను మూల్యాంకనం చేసేందుకు అలాగే రైలు కార్యకలాపాలకు సంబందించిన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ప్రధాన ఇన్‌పుట్‌లుగా ప్రారంభించడం వంటి కీలక సమయంలో శ్రీ పి.వి. మురళీ కృష్ణ గారు ఈ బాధ్యతలు చేపట్టారు.

 
 
 

Recent Posts

See All
MLAs Disqualification Case

🟥NEW SENSE ..... KTR comment It is impossible for Congress party to shield the defectors anymore as the Law laid down by the...

 
 
 

Comentarios


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page