top of page

మాజీ పోలీసును బెదిరించి..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Mar 5
  • 1 min read

మాజీ పోలీసు అధికారికి బెదిరింపులు..!

డబ్బులివ్వకపోతే జైలుకే అంటూ వార్నింగ్..!

నీ సిమ్ కార్డ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటూ బెదరగొట్టారు..!

సీబీఐ ఈడీ అదీ ఇదీ అంటూ భయబ్రాంతులకు గురిచేసిన ఉమన్ చీటర్..!

రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ ను డిజిటల్ అరెస్ట్ పేరుతో ట్రాప్ చేసి డబ్బులు లాగిన కేటుగాళ్లు..!

•••••••



ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధి మన్సూరాబాద్ హిమపురి కాలనీకి చెందిన కంచర్ల సత్యనారాయణ రెడ్డి ఎక్సైజ్ విభాగంలో ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తూ ఆరేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు.!

ఆయనకు గత నెలాఖరున ఒక గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చింది..! తన పేరు మేఘనా రెడ్డి అని పోలీస్ ఇన్స్ పెక్టర్ ను అంటూ పరిచయం చేసుకున్న మహిళ.. మీరు వాడుతున్న ఫోన్ సిమ్ కార్డ్ నుండి టెర్రరిస్ట్ లకు కాల్స్ వెళ్తున్నాయని మా పై అధికారులు విచారణ జరుపుతున్నారని నైస్ గా బెదిరింపులు మొదలు పెట్టింది.. తర్వాత మరోవ్యక్తి కాల్ లోకి వచ్చి మీ సిమ్ టెర్రరిస్ట్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు ఆధారాలు లభించాయని..మీ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని అడిగారు. మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు మేము సూచించే బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయాలని.. సీబీఐ ఈడీ ఎన్ఐఏ దర్యాప్తు చేసిన తర్వాత మళ్లీ ఆ డబ్బులు రిటర్న్ వస్తాయని ఆదేశించారు.. దీంతో బాధితుడు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.. తన ఖాతాలో ఉన్న దాదాపు లక్ష రూపాయలను వారు చెప్పిన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశాడు.. అయితే బాధితుడి వద్ద బ్యాంకులో పెద్దగా డబ్బులు లేవని గ్రహించిన కేటుగాళ్లు వెంటనే ఫోన్లు కట్ చేసి అందుబాటులో లేకుండా పోయారు.. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సత్యనారాయణ రెడ్డి జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు..!


ఈ ఘటనపై పోలీసులు క్రైమ్ నెంబర్ 285/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..!


•••••••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page