
దెబ్బతింటున్న రుషికొండ భవనాలు..!
- Writer Desk
- 4 days ago
- 1 min read
హైదరాబాద్ : నిర్వహణ లేక దెబ్బతింటున్న భవనాలు..!
వందలకోట్ల ఖర్చు.. లక్షల ఖర్చుతో బాత్ టబ్..!
అస్పష్టమైన ఆలోచనతో నిర్మాణాలు...!
ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తర్జన భర్జన..!

వర్షాలతో బయటపడుతున్న నిర్మాణ లోపాలు..!
పైకప్పులో లోపల వల్ల లీకేజీలు...
వర్షం పడినప్పుడల్లా కిందకు దిగుతున్న నీరు..!
కోట్లు ఖర్చుపెట్టి చేసిన ఇంటీరియర్ దెబ్బతింటున్న వైనం..!

ప్రమాదంలో ఫాల్ సీలింగ్..!
ఇప్పటికే నీళ్లు కిందకి దిగి తడిసిపోయిన ఫాల్ సీలింగ్..!
తాజాగా భవనాల్లోని పలుచోట్ల ఫాల్ సీలింగ్ షీట్లు విరిగి కిందపడిపోయిన దుస్థితి...
నిర్వహణ లేకపోవడంతో దుమ్ముకొట్టుకుపోతున్న లోపలివైపు గోడలు.. !
ఖరీదైన లైటింగ్ పరికరాలు లైటింగ్ వ్యవస్థ మొత్తంగా దెబ్బతింటున్న పరిస్థితి..
ఎంత ఖరీదైన కట్టడమైనా... నిర్వహణ లేకపోతే దెబ్బతినక తప్పదని నిరూపిస్తున్న రుషికొండ భవనాలు..!

వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనాలను వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం...
అధికారం చేపట్టి ఏడాది దాటినా.. భవనాలను సద్వినియోగం చేయడంలో జాప్యం...
నిర్ణయంలో లోపం వల్ల మూతవేసి నిరుపయోగంగా మారిన భవనాలు..

కనీసం రోజువారీ నిర్వహణపై కూడా దృష్టిపెట్టకపోవడంతో.. దెబ్బతింటున్న వైనం...
సరికొత్త భవనాలలో నిర్వహణ లేకపోతే ఇంకా ఎక్కువ దెబ్బతింటాయంటున్న నిపుణులు..!
పరిశీలన కోసం వెళ్ళి ఫోటో షూట్ చేయడంపై విమర్శలు...

డిప్యూటీ సీఎం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి...
జగన్ తప్పు చేశాడని.. మీరు అదే తప్పు చేస్తారా అంటూ..ప్రశ్నిస్తున్న జనం..!
ఐదారు వందలకోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన భవనాలను ఇలా నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్న ప్రజలు..!
తాజాగా కాస్త నిద్రలేచినట్లుగా ప్రభుత్వంలో కదలిక..!
ఎలా ఉపయోగించుకంటే బావుంటుంది అనే విషయంపై సమాలోచన..! స్పష్టత కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు..!

మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, బాల వీరాంజనేయ స్వామి తో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..!
కొండపైన ఉంది కాబట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వ దృష్టి..!
మంత్రుల కమిటీ అధ్యయనం చేసి ఇచ్చే నివేదికను బట్టి తదుపరి నిర్ణయం..!
త్వరిత గతిన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!
.....
Comments