top of page

కాంగ్రెస్ పార్టీకి షాక్..!

Writer: Writer Desk
Writer Desk
Sep 18, 2025
1 min read

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి..

పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ ఈరోజు ఉదయం జాగృతి అధినేత కల్వకుంట్ల కవితను కలిసారు..! మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక నాయకుడి ఇంట్లో వీరి భేటీ జరిగినట్లుగా స్పష్టమైన సమాచారం న్యూ - సెన్స్ కు అందింది...

గతేడాది జనవరిలో గవర్నర్ కోటాలో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం తో పాటు అమీర్ అలీఖాన్ కు కూడా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ..!

అయితే దీనిపై బిఆర్ఎస్ పార్టీ కోర్టు ను ఆశ్రయించింది..

రాజకీయ నేతలుగా ఉన్న వ్యక్తులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది..

తాజాగా గత నెలలో వీరిద్దరి నియామకాన్ని నిలిపివేస్తూ (నియామకాలపై స్టే విధింపు)చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది..

దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దగా స్పందించలేదు..ముఖ్యమంత్రి మాత్రం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ కోదండరాంపై కుట్ర చేసి పదవులు అడ్డుకుంటున్నారని, ఆయనకు మళ్ళీ పదవి ఇచ్చి తీరుతామంటూ స్పష్టం చేసారు..! అమీర్ అలీఖాన్ విషయంలో మాత్రం పెద్దగా ఎవరూ పట్టించుకున్నట్లు కనిపించలేదు.. ఆ తర్వాత గత నెలాఖరులోనే కోదండరాంతో పాటు మైనారిటీ నేత.. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని కోరుతూ క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేసారు. గవర్నరుకు తీర్మానాన్ని పంపించారు.

మరోవైపు జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మైనారిటీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో తమకు టికెట్ ఇవ్వాలంటూ అమీర్ అలీఖాన్ తో పాటు అజహరుద్దీన్ కూడా గట్టిగా పట్టుబడుతున్నారు.. అజహరుద్దీన్ కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా చెక్ పెట్టిన అధిష్టానం.. అమీర్ అలీఖాన్ విషయంలో పెద్దగా స్పందించలేదు... స్థానికంగా పట్టు ఉన్న నవీన్ యాదవ్ కే టికెట్ కేటాయించే అవకాశమున్నట్లుగా ప్రచారం సాగుతోంది..

ఒక వైపు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం.. తన స్థానంలో అజహరుద్దీన్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో తీవ్రంగా రగిలిపోతున్న అమీర్ అలీఖాన్ పార్టీ వీడెందుకు సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది..

ఈ నేపథ్యంలో ఆయన కవితను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

.....


Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page